శ్రీలంక క్రికెట్ అవార్డుల్లో సంగక్కరా క్లీన్‌స్వీప్
కొలంబో, సెప్టెంబర్ 6: శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా తమ దేశ క్రికెట్ బోర్డు ఇచ్చే వార్షిక అవార్డుల్లో సత్తా చాటాడు. అటు టెస్టుల్లోనూ , ఇటు వన్డేల్లోనూ అవార్డులు సొంతం చేసుకున్నాడు. బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మన్ , క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు పిపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా సంగక్కరానే దక్కించుకున్నాడు. గత ఏడాది నుండి సూపర్ ఫామ్‌లో ఉన్న సంగక్కరా టెస్టుల్లో 60.16 యావరేజ్‌తో 1444 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో 42.85 సగటుతో 1457 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఐదు సెంచరీలు , వన్డేల్లో మూడు శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా మహేళా జయవర్థనే ఎంపికయ్యాడు. అలాగే బెస్ట్ వన్డే ఆల్‌రౌండర్‌గా తిలకరత్నే దిల్షాన్ ఎంపికయ్యాడు. టెస్టుల్లో బెస్ట్ బౌలర్‌గా రంగన హెరాత్ , వన్డేల్లో లసిత్ మలింగా అవార్డులు గెలుచుకున్నారు. హెరాత్ 25.24 సగటుతో 70 వికెట్లు తీసుకున్నాడు.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా దినేశ్ చందిమాల్ అవార్డ్ గెలుచుకోవడం విశేషం.
శ్రీలంక క్రికెట్ అవార్డులు ః
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – కుమారా సంగక్కరా
బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ – కుమారా సంగక్కరా
బెస్ట్ టెస్ట్ బౌలర్ – రంగనా హెరాత్
పీపుల్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – కుమార సంగక్కరా
బెస్ట్ వన్డే బ్యాట్స్‌మెన్ – మహేళా జయవర్థనే
బెస్ట్ వన్డే బౌలర్ – లసిత్ మలింగా
బెస్ట్ వన్డే ఆల్‌రౌండర్ – తిలకరత్నే దిల్షాన్
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – దినేష్ చందిమాల్