-->

శ్రీలంక టెస్ట్‌ జట్టులో తరిందు కౌషల్‌

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడకుండానే ఎంపికైన స్పిన్నర్‌

కొలంబో ,నవంబర్‌ 9: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం శ్రీలంక క్రికెట్‌ జట్టును ప్రకటించారు. జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా యువస్పిన్నర్‌ తరిందు కౌషల్‌ను ఎంపిక చేశారు. 19 ఏళ్ల ఈ స్పిన్నర్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కూడా ఆడకుండానే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం జరుగుతోన్న వన్డే సిరీస్‌కు కూడా కౌషల్‌ ఎంపికైనా… తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ వెలిగెదర గాయం నుండి కోలుకోవడంతో తిరిగి ఎంపిక చేశారు. అలాగే ఫాస్ట్‌ బౌలర్‌ దమ్మిక ప్రసాద్‌ , శామిండ ఎరంగ కూడా జట్టులోకి తిరిగి వచ్చారు. అయితే పాకిస్థాన్‌పై ఆడిన నువాన్‌ ప్రదీప్‌ , పెరీరాలపై వేటు పడింది. ఇక స్వింగ్‌ బౌలర్‌ నువాన్‌ కులశేఖర తన చోటు నిలుపుకున్నాడు. బ్యాటింగ్‌లో మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదు. న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు వన్డేలకు కూడా సేమ్‌ టీమ్‌ను కొనసాగించాలని లంక సెలక్టర్లు నిర్ణయించారు. అటు రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్‌ నవంబర్‌ 17 నుండి గాలేలో ప్రారంభం కానుంది. నాలుగో వన్డే నవంబర్‌ 10 , ఐదో వన్డే 12న జరగనున్నాయి. వీటికి ¬ంబన్‌టోట ఆతిథ్యమివ్వనుంది.
శ్రీలంక టెస్ట్‌ జట్టు ః మహేళా జయవర్థనే (కెప్టెన్‌) , అంగెలో మాథ్యూస్‌ (వైస్‌ కెప్టెన్‌) , దిల్షాన్‌ , తరంగ పరన్‌వితనా , కుమార సంగక్కరా , తిలాన్‌ సమరవీరా , ప్రసన్న జయవర్థనే , తరిందు కౌషల్‌ , సూరజ్‌ రణ్‌దీవ్‌ , రంగన హెరాత్‌ , నువాన్‌ కులశేఖర , దినేష్‌ చందిమాల్‌ , వెలిగెదరా , శామిండ ఎరంగ , దమ్మిక ప్రసాద్‌,  శ్రీలంక వన్డే జట్టు ః
మహేళా జయవర్థనే (కెప్టెన్‌) , అంగెలో మాథ్యూస్‌ (వైస్‌ కెప్టెన్‌) , దిల్షాన్‌ , కుమార సంగక్కరా , దినేశ్‌ చందిమాల్‌ , తిరిమన్నే , పెరీరా , జీవన్‌ మెండిస్‌ , కులశేఖర , మలింగ , శామిండ ఎరంగ , ఉపుల్‌ తరంగ , రంగన హెరాత్‌ , అఖిల ధనంజయ , తరిందు కౌషల్‌