శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
గణేష్ మండపాలకు అనుమతులు పొందాలి
-కురవి ఎస్ఐ బి రాము నాయక్
కురవి ఆగస్టు-28 (జనం సాక్షి న్యూస్)
శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం
కొరకు
బుధవారం రోజున వినాయక చవితి పర్వదినం సందర్భంగా కురవి మండలంలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు మంటపములను ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకునే సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉన్నదని కురవి ఎస్సై బి రాము నాయక్ తెలిపారు. హిందూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శాంతియుతంగా జరుపుకోవాలని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను అధిగమించకుండా చూడాలని కోరడమైనది. మంట పాలలో డీజే లు పెట్టడం గాని, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు పెట్టడం గాని, పరుష పదజాలంతో నిందించుకోవడం గాని, చట్ట వ్యతిరేక కార్యక్రమాల కు పాల్పడవద్దని తెలియజేస్తున్నాను. వినాయక మండపాన్ని ఏర్పాటు చేసేవారు కమిటీగా ఏర్పడి ఆ కమిటీ పేరును, అందులోని సభ్యుల పేర్లను పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలి, అదేవిధంగా పర్మిషన్ కూడా తీసుకోవలసి ఉన్నది. నిమజ్జనం రోజు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలి, నిమజ్జనం ఏ రోజు చేసుకునేది,ఎక్కడ నిమజ్జనం చేసేది తెలియజేస్తూ లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇవ్వవలసి ఉన్నది. చట్ట వ్యతిరేకంగా, ఇతరులకు హాని జరగకుండా, అందరూ సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రులు జరుపుకొని కురవి మండలం వినూత్న రీతిలో మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మండలంలోని గ్రామపంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డు సభ్యులు, కార్యదర్శులు, భక్తులు, శ్రేయోభిలాషులు మంటప కమిటీలకు సహాయ సహకారాలు అందించి సమన్వయంతో పని చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాను.