సంకల్ప బలంతోనే ఏదైనా సాధ్యం

బి ఎన్. రం మోహన్ :శామీర్ పేట్, జనం సాక్షి :సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమవుతుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు బి ఎన్ రామ్మోహన్ కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అఫ్జల్ ఖాన్  అభిప్రాయం వ్యక్తం చేశారు శుక్రవా’రం షామీర్పేట మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలో ఉన్న  సేవ్ ఆల్ రీచ్ ఆల్ అనాధాశ్రమం లో భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోస్తవానికి వారు విచ్చేసి ప్రసంగించారు గత ఏడాది కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని వ్యక్తిత్వ వికాసము అభివృద్ధి ఆరోగ్యము జీవన విధాన శైలిపై అవగాహన కల్పించడం కల్పిస్తుందని అన్నారు  సువార్త మేడం మంచి సంకల్పంతో అనాధాశ్రమాన్ని ప్రారంభించి అనాధ చిన్నారులను చేరదీసి వీరితో పాటు వృద్ధులను సైతం అక్కున చేర్చుకొని అనాధాశ్రమాన్ని నిర్వహిస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవడం ప్రశంసనీయమని అభిప్రాయం వ్యక్తం చేశారు విద్యతోనే జీవన శైలిలో మార్పులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యారంగంలో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు కమిటీ ఆధ్వర్యంలో చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ(CWC ) ఆధ్వర్యంలో క్రీడా పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం పండ్లు పంపిణీ కార్యక్రమానికి కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అఫ్జల్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, అఫ్జల్ ఖాన్ ల తో పాటు స్థానిక సర్పంచ్ జీడిపల్లి కవితా వేణుగోపాల్ రెడ్డి షామీర్పేట  ఎంపీడీవో వాణి ఎంపీ ఓ సునీత సేవ్ అల్ రీఛార్జ్ అనాధ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సువార్త టిఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి దేవరయంజాల సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ మాజీ సభ్యులు నరసింహారెడ్డి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
19ఎస్పీటీ -1: బహుమతులు అందజేస్తున్న దృశ్యం