సంగాకు స్టెయిన్ ఫోబియా!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బ్యాట్స్మెన్ కుమారా సంగక్కరకు ఏమై ఉంటుంది? ఎందుకలా స్లోగా ఆడుతున్నాడని? సాక్షి.. ఫేస్బుక్ ద్వారా ఈ విషయంలో అభిప్రాయాలను కోరగా అభిమానుల భారీగా స్పందించారు. సంగక్కరకు దక్షిణాఫ్రికా బౌలర్ స్టెయిన్ ఫోబియా పట్టుకుందని కొందరు, ఇప్పటికే నాలుగు సెంచరీలు చేశాడు కదా.. మరో సెంచరీకోసం జాగ్రత్తగా ఆడుతున్నాడని మరికొందరు క్రికెట్ అభిమానులు తెలిపారు. ఇంకొందరైతే ఈ విషయంపై ఏం చెప్పాలో కూడా అర్థంకావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు