సంప్రదాయేతర ఇంధన వనరులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి):

రాష్ట్రంలో మొదటి దశకింద వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పాదన కు సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రి యను ఐదు నెలల్లో పూర్తి చేయా లని ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంప్ర దాయేతర ఇంధన వనరు లపై సచి వాలయంలో ఆయన ఉన్నతస్థా యి సమీక్ష నిర్వహించారు. బయోమాన్‌ విద్యుత్‌ యూనిట్‌ ధరను నాలుగు రూపాయల నుంచి ఐదున్నర రూపాయలకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీనివల్ల బిడ్‌కు 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్‌ సమకూరుతుందని అంచనా, అన్ని ప్రభుత్వ పా ఠశాలల, కళాశాలల వసతి గృహాల్లో వెలుతురు, వంట, వేడి నీటి కోసం అవసరమైన సౌర విద్యుత్‌ను అంచనా వేయాల్సిందిగా సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఎండిని సిఎం ఆదేశించారు. ఎపిఈఆర్‌సి పవన విద్యుత్‌కు సంబంధించి ఈ నెల 12వ తేదీన టారిఫ్‌ను నిర్దేశించనున్నందున పవన విద్యుదు త్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.