సబ్‌ప్లాన్‌పై వాడీవేడి చర్చ

నేటికి వాయిదా

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై శనివారం శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణ లు.. వాగ్బాణాలతో ఆసక్తికరంగా చర్చ సాగింది. మధ్యమధ్యలో సభ్యుల కవితలు, పెదవి విరుపులు సభలో నవ్వులు పూయిం చాయి. బిల్లుపై చర్చించేందుకు రెండోరోజు సమావేశం కాగానే.. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభ సమాౖ /ళిశమైన అనంతరం ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి సబ్‌ప్లాన్‌ బిల్లుకు సవరణను ప్రతిపాదించారు. అనంతరం ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహా సబ్‌ప్లాన్‌పై చర్చను

పార్టీ ఏర్పడిందని, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నమ్మి పీఆర్పీని కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేశానని ఆయన అన్నారు. తాము చేసిన సూచనకు కాంగ్రెస్‌ అధిష్టానం స్వీకరించి సోనియా నిర్ణయం మేరకు సభలో బిల్లు పెట్టడం హర్షించదగిన పరిణామమని ఆయన అన్నారు. బీసీ, మైనారిటీలకు కేటాయిస్తున్న నిధులకు కూడా చట్టబద్దత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏ వర్గమూ దూరం కాలేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. అయితే ఉప ఎన్నికల ఓటమిపై మీడియా ప్రశ్నించగా ఉప ఎన్నికలు కొన్ని సాధారణ పరిస్థితుల్లో జరుగుతాయని, సాధారణ ఎన్నికల్లో అలాంటి ప్రభావం ఉండదని చిరంజీవి అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు చట్టరూపం దాల్చిన నేపథ్యంలో తాను సంతోషాన్ని పంచుకునేందుకు అసెంబ్లీకి వచ్చానని చిరంజీవి అన్నారు.