సభను తప్పుదారి పట్టిస్తున్న నిమ్మల


ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహం
సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
పలు బిల్లులకు సభ ఆమోదం
అమరావతి,డిసెంబర్‌3(జనంసాక్షి):
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదారి పటిస్తున్నారని, పదేపదే అబద్దాలు చెప్పేవారికి మాట్లాడే అవకాశం? ఇవ్వొద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత లేదని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాస్తవాల ఆధారంగా రామానాయుడిపై చర్య తీసుకుంటామని స్పీకర్‌ సభలో ప్రకటించారు. సభలో వాస్తవాలు చెప్పాలని సభ్యులకు సూచించారు. రికార్డ్‌ నుంచి రామానాయుడు వాఖ్యలు తొలగించాలని స్పీకర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పెన్షన్ల పంపిణీపై టీడీపీ సభ్యులు చేసిన అసత్యాలను కొట్టిపారేశారు. ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై చర్చను తాను సిద్ధమన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత పెన్షన్‌ ఎంత అన్నది రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా చెబుతారని, ప్రతి ఒక్కరి నోటిలో నుంచి వచ్చేది రూ.1000 అని
గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రూ.2250 పెన్షన్‌ అందిస్తున్నామని సభలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్‌ ఇస్తూ, ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం పెన్షన్‌ రూ.2 వేలు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు,రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్లు 44 లక్షలు మాత్రమేననీ,
తమ ప్రభుత్వంలో 61.94 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ బిల్లు రూ.500 కోట్లు కూడా లేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వంలో నెలకు 1500 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇస్తున్నామన్నారు. టీడీపీ నేతలు ఓ పద్ధతి ప్రకారం అబద్దాలు చెబుతూ.. మోసాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికలకు ముందు ఏం చెప్పామన్నది మేనిఫెస్టోలో రాశామని,   ఆ మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావిస్తాం అని కూడా చెప్పామన్నారు. సభలో చర్చ సందర్భంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ సభ్యుడు రామానాయుడుపై సీఎం జగన్‌ మండిపడ్డారు. ఆయన
రామానాయుడు కాదు. డ్రామానాయుడని ఎద్దేవా చేశారు. అన్నీ అబద్దాలు చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం కోరుతామన్నారు. ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ సభ్యుడు రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్‌ తెలిపారు.పేదల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఏడాదిన్నరలో సంక్షేమ పథకాల ద్వారా రూ.67వేల కోట్లు అందించామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగుతోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ… ఒక్క కుటుంబానికి కూడా కన్నీళ్లు లేకుండా సంక్షేమం అందించారని ప్రశంసించారు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా సంక్షేమ పథకాలు ఆపలేదని, లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడే వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఏ పథకానికి ఎవరు అర్హులో గుర్తించడమే పెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు. భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడమే లక్ష్యంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లు ప్రవేశపెట్టినట్టు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఈ బిల్లుతో భూ వివాదాలకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. రెవెన్యూ చట్టాలను సంస్కరించి తయారు చేసిన ఈ బిల్లుతో భూ వివాదాలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను అభిప్రాయపడ్డారు. చర్చ తర్వాత ఏపీ భూ హక్కుల యాజమాన్య బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఏపీ మున్సిపల్‌ లా సెకండ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై చర్చించిన తర్వాత సభ ఆమోదం తెలిపింది. దిశా చట్టం సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. తమ?కు మాట్లాడే ఇవ్వాలని పట్టుబడుతూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. ఎవరెవరు మాట్లాడతారో ముందుగా తన లిస్టు పంపించకుండా ఇలా మధ్యలో అడగడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్‌ వివరణయిచ్చారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేశ్‌.. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యుల నినాదాల నడుమ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. కాసేపు సభకు అడ్డం పడి సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.
దిశా చట్టానికి 4 జాతీయ అవార్డులు: సుచరిత
గతంలో చేసిన దిశా చట్టానికి సవరణలు చేసి తాజాగా శాసనసభలో పెట్టారు. సవరణ బిల్లుపై ¬ం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల నివారణకు దిశా చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, విచారణ వేగవంతం కోసం డీఎస్పీస్థాయి అధికారిని నియమించినట్టు చెప్పారు. తిరుపతి, మంగళగిరి, విశాఖలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. దిశా చట్టానికి జాతీయస్థాయిలో 4 అవార్డులు వచ్చాయన్నారు. దిశా
చట్టంతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని విశ్వాసం చేశారు. దిశా చట్టం వచ్చాక 3 కేసుల్లో ఉరిశిక్షలు పడ్డాయని వెల్లడించారు. దిశ యాప్‌ను లక్షలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మంత్రి ప్రసంగం తర్వాత దిశా చట్టసవరణ బిల్లును సభ ఆమోందించింది.
ఎలక్ట్రిసిటీ డ్యూటి బిల్లు ఆమోదం
/ూక్షి, అమరావతి: ఆంధప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏపీ విద్యుత్‌ సుంకం సవరణ(ఏపీ ఎలక్టిస్రిటీ డ్యూటి అమెంట్‌మెంట్‌) బిల్లుపై చర్చకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అంగీకరించారు. దీంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభించారు. మంత్రి ప్రసంగం తర్వాత బిల్లు సభ ఆమోదం పొందింది. తర్వాత దిశా చట్టంపై చర్చ ప్రారంభమైంది. నగదు బదిలీ, కరోనా కట్టడిపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా, విూడియా, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు అరికట్టాలంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై శాసన సభలో చర్చించనున్నారు. శాసన మండలిలో నేడు 9 బిల్లులపై చర్చ జరగనుంది. పోలవరం, ఉద్యోగుల సంక్షేమం, శాంతిభద్రతలపై శాసన మండలి చర్చించనుంది.