*సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం*
కోదాడ, అక్టోబర్ 14(జనం సాక్షి)
ఎల్ఐసి పాలసీదారులకు బోనస్ రేట్లు పెంచి జీఎస్టీ ని ఎత్తివేయాలంటూ చేస్తున్న ఆందోళనలో ఏజెంట్లు అందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(లియాఫి) కోదాడ డివిజన్ అధ్యక్షులు కంజుల మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆల్ ఇండియా అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు గత నాలుగు రోజులు చేస్తున్నా సమ్మె ఐదవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలసీదారులకు బోనస్ రేట్లు పెంచాలని అదేవిధంగా ప్రీమియంపై జిఎస్టిని లేట్ ఫీజుపై విధిస్తున్న జిఎస్టిని ఎత్తి వేయాలన్నారు. ఎల్ఐసి వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కాగా ఏజెంట్లు గత నాలుగు రోజులుగా చేస్తున్న ధర్నాకు కార్యాలయ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో సంఘీభావం తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వట్టికూటి మల్లేష్, కోశాధికారి సొంధుమియా, బ్రాంచ్ గౌరవాధ్యక్షులు వెంకటాద్రి, డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మధిర వెంకటరెడ్డి, రామిరెడ్డి, ఖలీల్, కాటేపల్లి సూర్యనారాయణ, బి వి ఎల్ కాంతారావు,అలి తదితరులు పాల్గొన్నారు.
Attachments area