సమాచార హక్కు చట్టం కమిషనర్‌ 27న జిల్లా పర్యటన

కడప, జూలై 22 : సమాచార హక్కు చట్టం-2005, కమిషనర్‌ ఈ నెల 27న జిల్లాలో పర్యటిస్తున్నందున జిల్లా అధికారులు ఈ నెల 23న మధ్యాహ్నం సభాభవన్‌లో నిర్వహించే అధికారుల సమవేశానికి సమాచార హక్కు చట్టం కేసుల నమోదు రిజిష్టరు, ఇతర పత్రాలతో తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.