సమాజమును తన కవిత్వముతో దర్శింపజేసిన దార్శనిక కవి దాశరథి. ,,బి వెంకట్

    నిర్మల్ బ్యూరో, జూలై22,జనంసాక్షి,,,   సమాజమును తన కవిత్వముతో తన కావ్యాలతో తెలంగాణను డా దాశరథి కృష్ణమాచార్యులు దర్శింపజేశారని ,ప్రముఖ పద్యకవి బి వెంకట్ అన్నారు .డా దాశరథి కృష్ణమాచార్యుల జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం  తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల విద్యాలయము జూనియర్ కళశాల లో నిర్వహించారు. బాలికలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దాశరథి ఒక ఉద్యమదీప్తియని సినీ గేయాలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని ,నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసారని అన్నారు ప్రతి తెలంగాణ కవి దాశరథి సాహిత్యాన్ని చదవాలని ఆయన జీవిత సత్యాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు .అనంతరం గురుకుల విద్యాలయములో ప్రిన్సిపాల్ నీరడి గంగాశంకర్, వ్యాయామ ఉపాధ్యాయులు జాదవ్ గణేశ్, సహాయ ప్రిన్సిపాల్ మార్గరేట్  ఆధ్వర్యములో గురుకుల విద్యా సంవత్సరపు నూతన నాయకురాళ్ళ ఎన్నికలను నిర్వహించారు. స్కూల్ పీపుల్ లీడర్లుగా -జీలకరి మైత్రి, సూర హారిక ,కర్పె సంకీర్తన ,సమ్మెటి వైష్ణవి ల చేత సంస్కృతోపన్యాసకులు బి వెంకట్ గురుకుల ప్రమాణమును చేయించారు. ప్రగతి నాయకురాళ్లు ,ఫుడ్ కమిటీ నాయకురాళ్లు -కే అర్చిత ,ఏ వర్ష ,ఎస్ హర్షవర్ధినీ, జి శ్రావ్య ,కె భార్గవి లు *గురుకుల వికాస ప్రమాణాన్ని* చేసారు. ఉపాధ్యాయులు -వీణారాణి, కల్పన, రోహిణి ,బ్యూలారాణి, జ్యోతి ,వనజ ,సంతోశ్ ,ఓదేలు, తదితరులు పాల్గొన్నారు .
Attachments area