సముద్రాలలో చోరీ

కోహెడ: మండలంలోని సముద్రాలలో పిల్లి వెంకటయ్యకు చెందిన ఇంటిలో చోరీ జరిగింది. 15 తులాల బంగారం, 20తులాల వెండీ ,రూ . 15వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హుజురాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి , సీఐ తిరుమలు ఘటనాస్థలిని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.