సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 1 (): దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ నెల 20, 21 నిర్వహించే రెండు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని ఎఐటియుసి నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు ఉద్యోగ  భద్రత లేదని ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల ఎంతో నష్టపోతున్నారని వారు అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన 48గంటల సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.