– సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ..

కరకగూడెం,జులై21(జనంసాక్షి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
గోదావరి ముంపు ప్రాంతం వరద బాధితులు అందరికీ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన 10 వేల రూపాయలు మాటలు చెప్పకుండా తక్షణమే బాధితులకు అందించాలి అని అన్నారు.
అదేవిధంగా లోలోతు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మెట్ట ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించి ఇచ్చి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలన్నారు..
ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు, ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు, ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే దొంగ మాటలు చెప్పకుండా తక్షణమే నిధులు మంజూరు చేయాలని అన్నారు.
అలాగే ఈ వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు,ఇల్లు కూలి పాయినవారికి నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు,మరియు వర్షాల కారణంగా గుంతలు పడ్డ రహదారులను ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేయించాలన్నారు.రహదారులు
 లేక ఇబ్బంది పడుతున్న వలస ఆదివాసీలకు పక్కా రోడ్లు వెయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ ,మండల కార్యదర్శి షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.