సరబ్‌జిత్ బ్రెయిన్‌డెడ్!
భారత్ చేరుకున్న కుటుంబ సభ్యులు
లా¬ర్/న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి): పాకిస్తాన్ జైలులో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయుడు సరబ్‌జిత్ సింగ్ బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా సందేహాలు వెల్లువెత్తున్నాయి. ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందని, కోలుకోవడం ఇక కష్టమేనని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కోలుకోలేని స్థితిలో కోమాలో ఉన్నటుప్రకటించారు. అతడ్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, లా¬ర్ వెళ్లిన సరబ్‌జిత్ కుటుంబం బుధవారం భారత్‌కు తిరిగివచ్చింది. సరబ్‌జిత్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని వారు విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని త్వరలోనే కలుస్తామని చెప్పారు. పాక్‌లో తమకు సరైన భద్రత లేకపోవడం వల్లే భారత్‌కు తిరిగివచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, సరబ్‌జిత్‌పై దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ ఇంతవరకూ జైలు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్‌తో పాటు మరో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు దాడి జరిగిన రోజున ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ, ఇంతవరకూ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని అధికార వర్గాలు పీటీఐ వార్తాసంస్థతకు తెలిపాయి. కేవలం నోటీసులు ఇచ్చి సరిపుచ్చారని పేర్కొన్నాయి. లా¬ర్ పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన సరబ్‌జిత్‌సింగ్‌పై కోట్ లఖ్‌పతి జైలులో తోటి ఖైదీలు గత వారం పాశవికంగా దాడికి దిగారు. పదునైన ఆయుధాలు, ఇటుకలతో విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచారు. ఆయనను లా¬ర్‌లోని జిన్నా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నా.. ఎలాంటి పురోగతి లేదని జిన్నా వైద్యులు తెలిపారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో నాడీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని, కోలుకోలేని స్థితిలో కోమాలోకి ఉన్నాడని బుధవారం ప్రకటించారు. ఆయనను రక్షించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. సరబ్‌జిత్ పరిస్థితి పూర్తిగా విషమించిందని, ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కేంద్ర నాడీ వ్యవస్థను గ్లాస్గో కోమా స్కేల్ పూర్తిగా పడిపోయిందని, ఇక చేయడానికేవిూ లేదని ఆ వర్గాలు వెల్లడించాయి. గుండె కొట్టుకుంటున్నా.. అది వెంటిలేటర్ వల్లేనని, వెంటిలేటర్ తొలగిస్తే శ్వాస ఆగిపోతుందని పేర్కొన్నాయి. ఏ క్షణంలోనైనా ఆయన బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే, ముందుగా కుటుంబ సభ్యులు, పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ వెళ్లిన సరబ్‌జిత్ కుటుంబ సభ్యులు బుధవారం భారత్‌కు చేరుకున్నారు. సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్, భార్య సుఖ్‌ప్రీత్‌కౌర్, కూతుళ్లు స్వప్నదీప్, పూనమ్‌లు లా¬ర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారత్‌కు తిరిగివచ్చారు. సరబ్‌జిత్ చికిత్స కోసం భారత వైద్యులను పాక్‌కు పంపించాలని దల్బీర్‌కౌర్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై త్వరలోనే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాతో పాటు ఇతర నేతలను కలుస్తామని తెలిపారు. సరబ్‌జిత్‌పై దాడి జరిగినా కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.