సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ చేసిన సీఐ వినయ్ కుమార్

లింగాల ఘనపూర్ , జూలై   , ( జనం సాక్షి ):
లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో నూతనంగాఏర్పాటుచేసిన సరస్వతి దేవి విగ్రవిష్కరణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతి ధిగా సీఐ వినయ్ కుమార్ హాజరై సరస్వతి దేవి విగ్రహాన్నిఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సంస్కారం,మానవీయ విలువలు అలవర్చుకోవాలన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో బట్టి విధానాన్నిఅమలు చేస్తుంటారని అన్నారు.విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని అను కున్న దానిని సాధించాలన్నారు. బాధలో ఉన్న వారికి జాలి కాకుండా వారి స్థానంలో మనముంటే ఆ కోణంలో సేవలు అందించాలన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్యాల జయశ్రీ, ఎస్ ఐ రఘుపతి, ఎం ఈఓ చంద్రారెడ్డి, విగ్రహదాత బెల్లంకొండ సంధ్యా- ఆశోక్ గౌడ్,సర్పంచ్ చిట్ల స్వరూపరాణి, ఇన్చార్జి హెచ్ఎం చందా వాసుదేవ్,ఎస్ఎంసి చైర్మైన్ ఉప్ప లయ్య, ఉపాధ్యాయ మిత్రమండలి నుంచి రావు ల వెంకటేశ్ , ‌కుర్రేముల రమేష్, కాముని లక్ష్మణ్, కడకంచి రాజకుమార్,కత్తి శ్రీవాణి,ప్రణయ్,వార్డ్ మెంబర్ ఎనగందుల భాస్కర్, పాఠశాల అభివృద్ధి కమిటీ మెంబర్లు గొడిశాల శివరామకృష్ణ,చేపూరి ఉపెందర్,గంగాధర్,అశోక్, రావుల మల్లికార్జున్, పాఠశాల ఉపాధ్యాయులు అరుంధతి, శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి,ఇంద్రసేనా రెడ్డి,శ్రీనివాస్, జ్యోతి, భవాని  విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.