సరిహద్దుల్లో నక్సల్స్‌ ప్రాబల్యంపై పోలీసుల నిఘా

ఖమ్మం,నవంబర్‌ 21:జిల్లాలో మావోయిస్టులు అంత బలంగా లేదని పోలీసులు భావిస్తున్నారు.  ఉత్తర తెలంగాణ స్పెష ల్‌ జోనల్‌ కమిటీ-లో మావోయిస్టులు కేవలం 70 లేదా 80 మందే అని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాకు 170కిలోవిూటర్ల సరిహద్దు వెంబడి ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ-, ఆంధ్ర ఒరిస్సా బార్డర్‌(ఏవోబీ) మావోయిస్టు కమిటీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.అయితే ఈ మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టుల చొరబడకుండా జిల్లా సరిహద్దును కాపాడడడం, మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌లను అడ్డుకోవడంతోపాటు- జిల్లాలో మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న నేతలను కాపాడడం పోలీసులకు కత్తివిూద సామే. అయినా పోలీసులు పక్కా వ్యూహంతో ఇప్పటివరకు విజయం సాధిస్తూనే వస్తున్నారు. కేవలం మావోయిస్టు అగ్రనాయకులే తమ లక్ష్యమనే సంకేతాలిచ్చే ఆలోచనలో పోలీసులున్నారు. వారి అరెస్టులు, లొంగుబాట్లు-, ఎన్‌కౌంటర్లపై దృష్టి సారిస్తున్నారు. పైగా ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మావోయిస్టు అగ్రనేతల్లో మన రాష్టాన్రికి చెందిన వారే అధికం. ఇక్కడ ఉద్యమం పలచబడటంతోపాటు-, అనేకమంది లొంగుబాటలు పట్టడం, ఎన్‌కౌంటర్‌లు, అరెస్ట్‌లు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమనేతలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయని సమాచారం. అక్కడి కేడర్‌పై దృష్టి సారిస్తే.. జిల్లా సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 153 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో అయిదుగురు దళసభ్యులు, ముగ్గురు మిలీషియా కమాండర్లు, ముగ్గురు ఆర్‌సీవీ సీఎస్‌ఎం సభ్యులు, 142 మంది మిలీషియా సభ్యులు లొంగి పోయారు. 199మంది మావోయిస్టులు అరెస్ట్‌ అయ్యారు. వారిలో మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ- సభ్యులు  59 మంది దళ, మిలీషియా సభ్యులు, 129 మంది సంఘం, మిలీషియా కొరియర్లు అరెస్టయిన వారిలో ఉన్నారు. ప్రజాప్రతిఘటన మోహనన్న దళ సభ్యులు నలుగురు, జనశక్తి సభ్యులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఇటీవల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పోస్టర్లు వేయటం, చెట్లను నరకటం పెరిగింది. అయితే చెట్లు- నరుకుతున్న సమాచారం పోలీసులకు ఉన్నప్పటికీ మిలిటెంట్లు-, దళ సభ్యులు ఒకరిద్దరు చాలా దూరంగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ మామూలు జనంతో చేయిస్తున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ పనులు చేస్తున్న సామాన్యులపై కేసులుపెట్టి ఠాణాల చుట్టూ తిప్పడం వల్ల ఫలితం లేదని, వారికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా అది వ్యతిరేక ఫలితాలనిస్తుందన్న భావనలో పోలీసులున్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ-లో మూడు రీజనల్‌ కమిటీ-లున్నాయి. వాటి పరిధిలో ఎనిమిది డివిజనల్‌ కమిటీ-లు, 24 ఏరియా కమిటీ-లు, రెండు బెటాలియన్లు, ఎనిమిది కంపెనీలు, 24 ఎ/-లాటూన్స్‌ ఉన్నాయి. మొత్తం దాదాపు 2500 మంది మావోయిస్టులు అక్కడున్నారని అంచనా. జిల్లాతోపాటు-, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో మావోయిస్టు ఉద్యమాన్ని జిల్లా పోలీసులు కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. జిల్లాలో ఇటీవల మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లు, అరెస్ట్‌లు, ఎన్‌కౌంటర్లు ముమ్మరమయ్యాయి. ఇటీ-వల కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులకు చేరుతున్న రూ.50లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మూడు రాష్టాల్రకు చెందిన అయిదుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎన్నో ఏళ్లుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మిలీషియా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ పూనెం సారయ్య ఇటీవల పట్టుబడ్డాడు.