సర్కార్ శస్త్రచికిత్స పోందుతున్న మహిళలను పట్టించుకోని వైద్యులు
కోల్‌సిటీ, జనంసాక్షి: కుటుంబ నియంత్రణ చేసుకున్న మహిళలను నేలపై పడుకోబెట్టి మరోసారి తమ నిర్లక్ష్యం చాటుకున్నారు. సర్కారు దవాఖానా సిబ్బంది. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలను వైద్యులు ఎంతమాత్రం పట్టించుకోలేదు. గురువారం 40.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆపరేషన్లు చేయించుకున్న మహిళలను నేలపై పడుకోబెట్టడంతో తల్లడిల్లిపోయారు. ఆరోగ్యశాఖ పనితీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరానికి డాక్టర్ అలీం, డాక్టర్ రజినిప్రియదర్శిని, డాక్టర్ జయమాల, డాక్టర్ శేషుకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రభుత్వాస్పత్రిలోని నలుగురు జూనియర్ సర్జన్లు సునీల్, సత్యనారాయణ, సిద్ధార్థ, రవికి కుటుంబ నియంత్రణ చికిత్సలపై ఆస్పత్రిలో డాక్టర్ శిక్షణ ఇచ్చారు.