*సర్పంచ్ పై ఎంపిటిసి చేసిన ఆరోపణలు అవాస్తవం*

*మడత పల్లి ఉపసర్పంచ్, గ్రామస్తులు*
రేగొండ (జనం సాక్షి) : మడతపల్లి సర్పంచ్ కుసుంబా రంజిత్ పై ఎంపీటీసీ సూర స్వాతి సుధాకర్ చేసిన ఆరోపణలు అవాస్తమని గ్రామ ఉపసర్పంచ్ మోటపోతుల రవీందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో మడత పల్లి గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఉపసర్పంచ్ రవీందర్ మాట్లాడుతూ గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్నారు. ఎంపిటిసి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని,అక్రమాలు జరిగినట్టు అధికారుల ఫిర్యాదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపిటిసి ఫిర్యాదు చేసినందుకు అధికారులు వచ్చి ప్రతి అభివృద్ధి పనిని పరిశీలించి అక్రమాలు జరగలేదని తేల్చి చెప్పినట్లు ఉపసర్పంచ్ తెలిపారు. అయినప్పటికీ ఎంపిటిసి సూరస్వాతి సుధాకర్ హైకోర్టులో అభివృద్ధి పనులపై కేసు వేయడం సిగ్గుచేటు అని అన్నారు. మొదటి నుండి అనుమకొండ లో ఉంటున్న ఎంపీటీసీ సూరస్వాతి సుధాకర్లు గెలిచినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా గ్రామానికి రాలేదని, గ్రామ అభివృద్ధిని పట్టించుకోలేదని వాపోయారు. ఎస్సీలు తాగించి నాపైకి ఉసిగొలుపుతున్నారని ఎంపీటీసీ అన్న మాటలు ఎస్సీలను కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. ఎంపీటీసీ సూరస్ స్వాతి సుధాకర్ గ్రామానికి వచ్చి చేసిన అభివృద్ధి పనుల్లో ఎక్కడ అక్రమాలు జరిగాయి గ్రామస్తుల ముందు నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలోకి వస్తే ఎంపిటిసి పై దాడికి దిగుతారనేది అవాస్తవమని గ్రామానికి ఎంపిటిసి వచ్చి అభివృద్ధి చేస్తే ఆయనకు మేము అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఎక్కడ ఉండి తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదని, గ్రామానికి వచ్చి ఏదైనా ఉంటే నిరూపించాలని అన్నారు. కమిషన్లు అడిగిన మాట వాస్తవమేనని మేము నిరూపిస్తామని, గ్రామంలోనే ఇవన్నీ మాట్లాడుకుందాం అంటూ కొందరు గ్రామస్తులు ఎంపిటిసి కి సవాల్ విసిరారు. ఈ సమావేశంలో గ్రామస్తులు కుసుంభ నరహరి, ఒరగంటి ఓంకార్, సబ్బిడి సురేందర్ రెడ్డి, చక్రాపు నరేష్, దేవుల పల్లి సురేందర్, గాజుల సాగర్, సబ్బిడి రవీందర్ రెడ్డి,రాజు దేవులపల్లి శ్రీహరి తది తరులు పాల్గొన్నారు.