సర్వసభ్య సమావేశం లో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు
ప్రతి సారీ డుమ్మా కొడుతున్న పలు శాఖల అధికారులు
రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్19 రాయికోడ్ మండల సర్వసభ్య సమావేశం సోమవారం రోజు మధ్యాహ్నం ఎంపిపి మమత-అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో హాజరైన పలు శాఖల అధికారులు గైర్హాజరు పై సర్పంచ్ లు,ఎంపిటిసిలు అసహనం వ్యక్తం చేశారు.ప్రతి సారీ పలు శాఖల రావట్ల పట్ల ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడంతో మండల అభివృద్ధి అధికారి వెంకటేశం గైర్వజరు అయిన అధికారులపై జిల్లా అధికారులకు నివేదిక పంపించమని అన్నారు. సమావేశంలో మండల ఎంపిఓ, అంగన్వాడీ, ఫారెస్ట్, విద్యుత్ మరియు ఆర్టికల్చర్ అధికారులపై సర్పంచులు నరేష్ కేదార్నాథ్ పటేల్ కృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఔరంగ నగర్ గ్రామ సర్పంచ్ రైతు వేదిక దారేది అని అడుగుతే రేపు వస్తా ఎల్లుండొస్తానని మండల పంచాయతీ అధికారి తెలుపడంతో సర్పంచ్ నాగార్జున ఆవేదం వ్యక్తం చేశారు. అల్లాపూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఏపీఓ గురుపాదం పై అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు ఒకే విధంగా చూడాలని ఒకరిని ఒక విధంగా ఒకరిని ఒక విధంగా చూచి ఎంబి లు రాయడం సరికాదని అగ్రం వ్యక్తం చేశారు. మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మమత-అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అని అన్నారు జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో మండలంలో 29 పంచాయితీ రోడ్లు మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నేతృత్వంలో అన్ని మండలాలు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజయ్య ఎంపీడీవో వెంకటేశం. ఏపీఓ గురుపాదం ఎంఈఓ శ్రీనివాస్. ఏఈ లు ప్రవజల. ముఖిత్. తహ . శశి కుమార్ జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి, మండల కోఆప్షన్ మెంబెర్ అబేద్, ఎంపిటిసిలు పండరి, శివకుమార్ పాటిల్, నిరంజన్, సత్తెమ్మ. సర్పంచులు ప్రవీణ్ కుమార్, నాగార్జున్, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ . శంకర్ .తదితరులు పాల్గొన్నారు.