సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మ కాల్చివేత

 

మహేంద్రకర్మతో రహమాన్‌ ఫేస్‌ టు ఫేస్‌
సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మను జనంసాక్షి ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌ 2008, 2009 సంవత్సరాల్లో ఇంటర్వ్యూ చేశారు. టీవీ 5, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన కాలంలో దండకారణ్యంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించేందుకు ధైర్య సాహసాలతో ఛత్తీస్‌గఢ్‌లో అడుగుపెట్టారు. మావోయిస్టులు, ఎస్పీవోలు/పోలీసులకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆవిష్కరించారు. దండకారణ్యంలోని సహజ వనరులపై కన్నేసిన బహుళజాతి కంపెనీలకు రాజ్యం వంతపాడుతోందంటూ మావోయిస్టులు ఆదివాసీల పక్షాన నిలిస్తే, మహేంద్రకర్మ గిరిజనులకు తుపాలకులిచ్చి వారిపై యుద్ధానికి పురిగొల్పారు. ఈ పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ఎలా జీవనం సాగిస్తున్నారు అనేది బాహ్య ప్రపంచానికి చాటేందుకు దండకారణ్యంలోకి వెళ్లి అక్కడ నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టారు. మావోయిస్టుల దాడిలో మోస్ట్‌వాంటెడ్‌ మహేంద్రకర్మ మృతిచెందిన సందర్భంగా అప్పటి ఇంటర్వ్యూ చిత్రం పాఠకుల కోసం.