సహకార సంఘంలో అధ్వర్యంలో

సూపర్ మార్కెట్ సేవలు. డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి.
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో త్వరలో సూపర్ మార్కెట్ సేవలు ప్రారంభించనున్నట్లు నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి అన్నారు.స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ సంఘము ద్వారా అర్హులైన రైతులకు సల్పకాలిక దీర్ఘ కాళిక ఋణములు,సంఘము ద్వారా రైతుల ప్రయోజనం కోసమే  పురుగు మందుల వ్యాపారము ప్రారంబించామన్నారు.బయట మార్కెట్లో కన్నా సహకార సంఘం ద్వారా రేటు తక్కువ నాణ్యత ఎక్కువ ఉంటుందని చెప్పారు.త్వరలో ప్రారంభించనున్న సూపర్ మార్కెట్ నేరేడుచర్ల పాలకీడు గరిడేపల్లి మండలం ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకు అందించడంమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నామని సూపర్ మార్కెట్ ను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. సమావేశమునకు సంఘ ఉపాధ్యక్షులు,కొప్పుల రాంరెడ్డి, సంఘ పాలకవర్గ సభ్యులు తాళ్ల రామకృష్ణారెడి,పోరెడ్డి పద్మ,దేవులపల్లి శంకరాచారి,తాళ్ల సురేశ్ రెడ్డి,కట్టా సత్యనారాయణ రెడ్డి,నూకల వెంకట రెడ్డి,చందమల్ల వెంకన్న,వేముల జయమ్మ,కుసుమ శేఖర్ రెడ్డి,సపావత్ భీక్య,సంఘ మాజీ ఛైర్మన్ పోరెడ్డి బుచ్చిరెడ్డి,సంఘ పరిధిలోని రైతులు సంఘ  సీఈఓ శ్రీనివాస్,  సిబ్బంది పాల్ఘోన్నారు.