సాగర్ ఎడమ కాలువనుంచి నీరు విడుదల
పూజలు చేసి విడుదల చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
నాగార్జునసాగర్,జూలై28(జనంసాక్షి ): నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి.. కృష్ణమ్మకు సారె సమర్పించారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. జులై నెలలో నీటిని విడుదల చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారని చెప్పారు. మొత్తం 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందిం చామన్నారు. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.16 లక్షల ఏకరాలలో పంట సాగవుతున్నదని వెల్లడిరచారు. నల్లగొండ జిల్లాలో 1,45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,41,000 వేల ఎకరాలు సాగుబడిలో ఉన్నాయని తెలిపారు.
ఇక నల్లగొండ జిల్లాకు 18 టీఎంసీలు, సూర్యాపేట జిల్లాకు 18 టీఎంసీలు, ఖమ్మం జిల్లాకు 29 టీఎంసీలు అందుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నదని, తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందుతుందన్నారు. కిందటేడాదితోపోల్చితే సాగర్ జలాశయానికి అదనంగా నీరు వచ్చిచేరుతున్నదని వెల్లడిరచారు