సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
ప్లాస్టిక్ కవర్లపై నిషేధం సామాన్యులకేనా ?
పలువురు అధికారుల గైర్హాజర్
తమ ఇష్టాను సారంగా వచ్చిన అధికారులు: ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫైర్
దంతాలపల్లి ఆగస్టు జనంసాక్షి
ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచులు,ఎంపీటీసీలు, అధికారులు గైర్హాజర్ కావడంతో సమావేశం సాదాసీదాగా ముగిసింది.
శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వలాద్రి ఉమా మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి డోర్నకల్ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్డి నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ముందుగా వైద్య ఆరోగ్యశాఖ పై అడిగిన ప్రశ్నకు సమాధానం గా మండల వైద్యాధికారి డాక్టర్ వేద కిరణ్ మాట్లాడుతూ మండలంలో సీజనల్ వ్యాధులతో పాటు కోవిడ్ కేసులు కూడా రోజు ఒకటి రెండు నమోదు అవుతున్నాయని ప్రజల ప్రవర్తనంగా ఉండి బారిన పడకుండా ఉండాలని సూచించారు అదేవిధంగా కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేస్తున్నామని 100% వ్యాక్సిన్ లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ సహకరించాలని కోరారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతినెల మందులు ఇస్తూ పౌష్టికాహారం కోసం 500 రూపాయలు వారి వారి ఎకౌంట్లో వేస్తున్నట్లు తెలిపారు.అదే విధంగా బీపీ,షుగర్ రోగులకు ఆరోగ్య కేంద్రంలో పరీక్షల నిర్వహించి మందులు ఇస్తున్నామన్నారు. అనంతరం సమావేశానికి హాజరుకాని విద్యుత్ ఏఈ విద్యాసాగర్, తదితర అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవో బండి గోవిందరావును ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆదేశించారు. ఇదిలా ఉండగా సమయపాలన పాటించకుండా కొంతమంది అధికారులు సమావేశం ముగింపు దశలో రావడంతో వారిపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
ప్లాస్టిక్ కవర్లపై నిషేధం సామాన్యులకేనా అధికారులకు వర్తించదా అంటూ పలువురు ముచ్చటించుకోవడం కనిపించింది వివరాల్లోకి వెళితే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వo నిషేధించిన ప్లాస్టిక్ కవర్లలో ఏదో పట్టుకు రావడం తో ప్లాస్టిక్ కవర్ల నిషేధం అధికారులకు వర్తించదా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.