సామాన్యులలో అతి సామాన్యుడిగా……
బీడీ కార్మికులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాటామంతి
ఆడబిడ్డలకు అండ గులాబీ జెండా అన్న మహిళలు
జగిత్యాల పట్టణంలో పలు వార్డులో 24 మంది లబ్ధిదారులకు సీఎం సహయనిధి ద్వారా మంజూరైన 8లక్షల 60 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి స్వయంగా వెళ్లి అందజేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆరాతీస్తూ,సమస్యలు వింటూ చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా మన రాష్ట్రంలోని మహిళలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయానికి పూర్తి మద్దతు పలికారు జగిత్యాల లోని బీడీ కార్మికులు.ఆడబిడ్డల మంచి కోసం బీడీ పెన్షన్లతో పాటు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ఆడవాళ్ళందరికీ దేవుడిచ్చిన సోదరుడు అంటూ మహిళలు ఎమ్మెల్యే తో పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కృష్ణ నగర్ లో ఒక ఇంట్లో చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అక్కడే ఉన్న బీడీ కంపెనీకి వెళ్లి బీడీ కార్మికులతో మాట్లాడుతూ కాసేపు గడిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో బీడీ కార్మికులకు ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎనిమిది సంవత్సరాలుగా బీడీ కార్మికులకు జీవన భృతి పేరుతో నెలకు 2000 చొప్పున అందిస్తున్నామన్నారు. నిజామాబాద్ ఎంపీగా కవిత పనిచేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ ను ఒప్పించి మెప్పించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇప్పించారనే విషయాన్ని ఎమ్మెల్యే సంజయ్ మహిళలకు గుర్తు చేశారు. ఎనిమిది సంవత్సరాలు గా కనీసం 1,30,000/- వరకు సాయం అందింది అని అన్నారు. బీడీ కార్మికులకు కాకుండా మహిళలకు సీఎం కేసీఆర్ చాలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలతో పాటు ఒంటరి మహిళలకు సైతం పెన్షన్ ఇస్తున్నారన్నారు. కేసీఆర్ గారికి పురుషులకంటే మహిళలపైనే నమ్మకం ఎక్కువ అని అందుకే రేషన్ కార్డులో కళ్యాణ లక్ష్మి చెక్కులు,డబల్ ఇళ్ల మంజూరు లో ఆడవాళ్ళ పేర్ల మీద ఇస్తున్నారన్నారు ప్రజాప్రతినిధిగా డాక్టర్ గా బిజీగా ఉండే సంజయ్ కుమార్ బీడీ కార్ఖానాలో సాధారణ వ్యక్తిగా మహిళా కార్మికులతో మాట్లాడుతుండడంతో కార్మికులు సంబ్రమాచ్చర్యాలకు లోనయ్యారు. ఎమ్మెల్యే తో మహిళా కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ బీడీ పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ ,కళ్యాణ లక్ష్మి, బతుకమ్మ చీర ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చాలామందికి లబ్ది చేకూరుతుందని సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలు అందరికీ దేవుడు ఇచ్చిన అన్న అని ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే స్వయంగా బీడీ కంపెనీకి వచ్చి తమతో కూర్చొని మంచి చెడులు విచారం చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ బీడీ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు