సామాన్యులు వాడే ఉత్పత్తులపై జిఎస్టి దుర్మార్గం

    సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు
వనపర్తి జులై 21(జనం సాక్షి) సామాన్యులు వాడే 14 రకాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాజీ కార్యదర్శి డి చంద్రయ్య విమర్శించారు. గురువారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇప్పటికే పేద ప్రజలు వాడే డీజిల్,పెట్రోలు,నిత్యవసర వస్తువులు,బస్ చార్జీలు, వంట గ్యాస్, విద్యుత్ చార్జీలు తదితర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విడిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరో 14 రకాల ఉత్పత్తులపై జిఎస్టి విధించడం సరికాదన్నారు కార్పొరేట్ శక్తులకు పన్ను రాయితీలుస్తూ సామాన్యులు వాడే వాటిపై జిఎస్టి విధించడం ఏమిటని ప్రశ్నించారు.భారీ వర్షాల వల్ల వరదల వల్ల రైతులు పంటలు కోల్పోయారని వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పడిపోయిన గృహాలకు పరిహారం ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని 57 ఏళ్ల వారికి వృద్ధాప్య పింఛన్ అర్హులందరికీ రేషన్ కార్డులు ఆగస్టు నెలలో ఇస్తామని చాలాకాలంగా వూరిస్తున్నారని వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ఎన్నో పోరాటాలను చేస్తుందన్నారు అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా మహాసభలు ఆగస్టు 6,7 తేదీలలో జరుగుతాయని వెల్లడించారు గతంలో జూలై 21,22 తేదీలలో మహాసభలను నిర్వహించాలని తలపెట్టిన కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగస్టులో జరపడానికి జిల్లా కమిటీ నిర్ణయించిందన్నారు.6న బహిరంగ సభ 7న ప్రతినిధుల సభ జరుగుతాయని తెలిపారు ఈ మార్పులు గమనించాలని పార్టీ క్యాడర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ కార్యదర్శి డి చంద్రయ్య,కళావతమ్మ, జె చంద్రయ్య,శ్రీరామ్,రమేష్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు
Attachments area