సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

           ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించిన    రాష్ట్ర విద్యా  శాఖ  మంత్రి
 ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని  రాష్ట్ర విద్యా శాఖ   మంత్రి సబిత ఇంద్రారెడ్డి    అన్నారు.   సోమవారం  ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని     చంపాపేట డివిజన్  ఏం.ఆర్.ఆర్ కాలనీ ప్రధాన రహదారిపై వున్న    జీవన్ మల్టి స్పెషలిటీ హాస్పిటల్ లో  నూతనంగా ఎర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ను    రాష్ట్ర  విద్యా శాఖ మంత్రి    మంత్రి సబిత ఇంద్రారెడ్డి    ముఖ్య  ఆథిదిగా హాజరై ,స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి  ‘కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  ‘అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లతో  కలిసి    జ్యోతి ప్రజల్వన చేసి రిబన్  కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా   మంత్రి సబితా ఇంద్రారెడ్డి    మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే  ఈ  ప్రాంతాల్లో  ఉన్నత ప్రమాణాలతో హాస్పిటల్ ను    ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  నగరంలో  ప్రజలకు   మంచి  సేవలు  అందిస్తూ  పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని  మరిన్ని  శాఖలు  విస్తరించాని కోరారు .   సామాన్య ప్రజలకు వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు వసూలు చేస్తూ మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు . ఈ కార్యక్రమంలో   డాక్టర్ వై రమేష్ బాబు  డా,.బి దుర్గారాణి డాక్టర్ అంబిక  మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  మురు కుంట్ల   అరవింద్ శర్మ   , ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు