సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

పినపాక నియోజకవర్గం జులై 19 (జనం సాక్షి): మణుగూరు మండలంలోని వరద బాధితులకు సింగరేణి ఆధ్వర్యంలో ఏరియా ప్రధాన అధికారి జక్కం రమేశ్ ఆదేశాల మేరకు అన్నారం గ్రామంలో సింగరేణి సివిల్, మెడికల్, పర్సనల్ విభాగాల పర్యవేక్షణలో మంగళవారం మెడికల్ క్యాంప్, శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి నది పరివాహక ప్రాంతం అన్నారం గ్రామంలోని ఇండ్లలోకి భారీ వరద నీరు చేరటంతో దిక్కు తోచని స్థితిలో ఆహారం కోసం, త్రాగు నీటి కోసం అలమటిస్తున్న నిరాశ్రయులకు తోడుగా మేమున్నామంటూ సింగరేణి సంస్థ చేయూతనివ్వడం జరిగింది. అన్నారం గ్రామానికి గత నాలుగు రోజులుగా రెండు పూటలా 300 మందికి భోజనం త్రాగునీరు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతమంతా చెత్త బురద వల్ల ఈగలు, దోమలతో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సింగరేణి వైద్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని, ఉచిత మందుల పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ప్రాంతాలలో, డ్రైనేజ్లలో బ్లీచింగ్ చెల్లించారు.
ఈ కార్యక్రమంలో ఏజిఎం(సివిల్) డి వెంకటేశ్వర్లు , డిజిఎం(పర్సనల్) ఎస్. రమేశ్ , డాక్టర్ శేషగిరిరావు గ్రామ పెద్దలు రాధ, శ్రీఉద్దండు, తదితరులు పాల్గొన్నారు