సింగరేణి కుటుంబాల్లో వెలుగు నింపనివారసత్వం

ఇంక ఎన్నాళ్లీ ఎదురుచూపులు 
ఖమ్మం,మే17(జ‌నం సాక్షి): సింగరేణిలో దీర్ఘకాలికంగా నలుగుతున్న వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారం అయినట్లే అయి అందుండా పోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై ఆశలు పెట్టుకున్న  కార్మిక కుటుంబాలు రోదిస్తున్నాయి.  తమ భవిష్యత్తు అంధకారమైందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను ప్రకటించక ముందునుంచే సింగరేణిలో కార్మికుల బిడ్డలు ఒక సంఘంగా ఏర్పడి కార్మిక సంఘాలను నిలదీస్తూ ఆందోళనలకు పూనుకున్నారు. కార్మిక కుటుంబాల్లో అసంతృప్తిని గమనించి  చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి చేసిన ప్రకటన నిష్ఫలం కావడంతో నేతలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదిలావుంటే ఉద్యోగం చేయలేని స్థితిలో ఎందరో డ్యూటీకి వెళ్ళడం లేదు. కాలు విరిగి ఒకరు, కళ్లు కనిపించక మరోకరు, చేయి పనిచేయక ఒకరు ఇలా రకరకాల కారణాలతో మంచం పట్టిన వారున్నారు. వీరి వారసలుకు ఉద్యోగం దక్కివుంటే సంసారం సాఫీగా సాగేది. కానీ ఇలాంటి కుటుంబాల వారు ఇప్పుడు నిత్యం వెక్కివెక్కి ఏడుస్తున్నాయి. నెలలుగా డ్యూటీలకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లు గడవటమే కష్టంగా ఉంది.  సింగరేణి యాజమాన్యం వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తే తండ్రి ఉద్యోగాన్ని చేస్తూ కుటుంబానికి ఆసరగా ఉండాలని చూస్తున్న సమయంలో ఈ సంధిగ్ధత నెలకొంది. ఇదిలావుంటే కార్మికులకు నాయకులు కూడా అనేక భ్రమలు కల్పించారు. ఎఆంటి వారికైనా వారసత్వ ఉద్యోగం తప్పదని రెచ్చగొట్టారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారసత్వ ఉద్యోగాల ప్రకటన వెలువడటంతోనే గుర్తింపు కార్మిక సంఘం చేసిన హడావుడి తెలిసిందే. ఒక్కరోజు సర్వీసు ఉన్నా ఉద్యోగాలు వస్తాయని నాయకులు లేనిపోని ఆశలు కలింపించారు. దీంతో అనేక మంది కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా, నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
తెలంగాణ ప్రకటించినప్పటి నుంచి వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్‌ చేసారు.   నిరుద్యోగుల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటి వరకు ఉద్యోగం రాదనుకుని 35 ఏళ్లు దాటిన వారు, తమ తమ్ముళ్లకు అవకాశం ఇచ్చిన వారు, మేమే ఉద్యోగం చేస్తామంటూ ముందుకు రావడంతో కార్మిక కుటుంబాల్లో పంచాయతీలు మొదలయ్యాయి. అప్పటికే అన్నదమ్ముల మధ్య వారసత్వ గొడవలు జరిగి ఆర్థిక సర్దుబాట్లు జరిగిన కుటుంబాలు కుదుటపడ్డాయి.  నిశ్చింతగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారాయి. దీనికితోడు సింగరేణిలో ఇటీవలి కాలంలో నాయకుల్లో స్వార్థం పెరిగింది.ఎవరికి వారు తమ సంఘానికే కార్మికుల్లో గుర్తింపు, పట్టు ఉండాలనే రీతిలో సంఘాలు వ్యవహరిస్తున్నాయి. కార్మిక సంఘాలు దీన్ని సామాజిక సమస్యగా పరిగణించి, యాజమాన్యంతో ఒప్పందం చేసుకునే వెసులుబాటు గురించి నిస్వార్థంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.