సిండికేట్‌ బ్యాంక్‌కు 17.61శాతం వ్యాపార వృద్ధి

విజయవాడ: సిండికేట్‌ బ్యాంకు ఈ త్రైమాసికంలో చక్కటి పనితీరుతో ఉత్తమ ఫలితాలు సాధించిందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం. ఆంజనేయప్రసాద్‌ తెలిపారు. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూన్‌ 2012 నాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం 17.61శాతం వృద్ధి చెందిందని తెలిపారు. ప్రాధాన్యత రంగానికి రూ. 42,336కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 17,766కోట్ల రుణా రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రిటైల్‌ బ్యాంకింగ్‌ విభాగంలో గృహరుణాల కింద రూ. 8492కోట్లు బంగారు ఆభరణాలపై రూ. 4.066కోట్లు, విద్యారుణాలు రూ. 2,312కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం కింద శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని 84శాఖల ద్వారా రూ. 3,786కోట్ల వ్యాపారం జరిగిందన్నారు.