సిడ్నీలో చెలరేగిన ఆసీస్‌ సీమర్లు

శ్రీలంక 294 ఆలౌట్‌   టోని గ్రెగ్‌కు ఘననివాళి

సిడ్నీ, జనవరి 3: సొంతగడ్డపై క్లీన్‌స్వీప్‌పై కన్నే సిన ఆస్టేల్రియా చివరి టెస్టులో శ్రీలంకను కట్టడి చేసింది. ఆ జట్టు సీమర్లు సమిష్టిగా రాణించి లంక ను దెబ్బతీశారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్‌ కరుణార తనే వికెట్‌ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ దిల్షాన్‌, జయవర్థనే నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. దిల్షాన్‌ 34 పరుగులకు ఔటయ్యాక జయ వర్థనే, తిరిమన్నేతో కలిసి ఇన్నింగ్స్‌ ని ర్మించాడు. మూడోవికెట్‌కు ఈ జోడీ 72 పరుగులు జోడించడంతో లంక కోలుకున్నట్టే కనిపించింది. ఈ క్ర మంలో వీరిద్దరూ హాఫ్‌సెంచరీలు పూర్తిచేసున్నారు. ఈదశలో స్టార్క్‌ బౌలింగ్‌లో జయవర్థనే ఔటవడంతో లంక వికెట్ల పతనం వేగంగా సాగిం ది. తిరిమన్నే కాసేపు పోరాడడంతో స్కోర్‌ 200 దాటింది. చివర్లో చంది మాల్‌ కూడా వేగంగా ఆడి 24 పరుగులు చేశాడు. లోయ ర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేసేందుకు ఆసీస్‌ బౌలర్లు ఎక్కువ సేపు శ్రమిం చలేదు. దీంతో శ్రీలంక ఇన్నిం గ్స్‌కు 294 పరు గుల దగ్గర తెరపడింది. తిరిమన్నే 91 పరుగులకు ఔటయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో బర్డ్‌ 4, స్టార్క్‌ 3, సిడిల్‌ 2, ల్యాన్‌ 1 వికెట్‌ పడగొట్టారు. మరో రెండు ఓవర్లు ఆడే అవకాశమున్నప్పట కీ అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. దీంతో ఆస్టేల్రియా తమ తొలిఇన్నింగ్స్‌ను రేపే మొదలు పెట్టనుంది.

సిడ్నీ టెస్టులో టోనీ గ్రెగ్‌కు ఘన నివాళి

ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్‌తో ఇటీవల మరణించిన మాజీ క్రికెటర్‌ టోనీ గ్రెగ్‌కు సిడ్నీ టెస్ట్‌ సందర్భంగా ఘన నివాళ అర్పించారు. క్రికెట్‌ ఆస్టేల్రియా ప్రతినిధులతో పాటు శ్రీలంక, ఆసీస్‌ క్రికెటర్లు, వందలాది మంది అభిమానులు మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఒక నిమిషం పాటు మౌనం పాటించి టోనీ పట్ల తన గౌరవాన్ని చాటకున్నారు. దీనితో పాటు టోనీ గ్రెగ్‌ ధరించే ప్రత్యేక క్యాప్‌ను సింబాలిక్‌గా వికెట్లపై ఉంచారు. అలాగే గ్రెగ్‌ కుటుంబసభ్యులు, ఛానెల్‌ 9 కామెంటరీ టీమ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ నిర్వాహకులు ఇరు జట్ల కెప్టెన్లతో సంభాషించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గ్రెగ్‌ భార్య వివియన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. కొత్త సంవత్సరంలో జరుగుతోన్న మ్యాచ్‌కు టోనీ లేకపోవడంపై చాలా బాధగా ఉందని , అభిమానుల మనసుల్లో ఆయన ఎప్పటికీ నిలిచే ఉంటారని వ్యాఖ్యానించారు. మ్యాచ్‌ సందర్భంగా ఇలాంటి గౌరవాన్ని ఏర్పాటు చేసిన నిర్వా హకులకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇదిలా ఉంటే టోనీ గ్రెగ్‌ను గుర్తు చేసుకుంటూ చాలా మంది అభిమానులు ఆయన ధరించే ప్రత్యేక క్యాప్‌ను పెట్టుకుని సందడి చేశారు. అటు ఆసీస్‌ జట్టు కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ కూడా మెడలో ప్రత్యేక వస్త్రం ధరించి గ్రెగ్‌ పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. 66 ఏళ్ళ టోనీ గ్రెగ్‌ ఇటీవలే క్యాన్సర్‌తో మృతి చెందారు. 1972 నుండి 1977 మధ్య కాలంలో అద్భుతంగా రాణించిన గ్రెగ్‌ 58 టెస్టుల్లో 3599 పరుగులు చేశారు. అలాగే 32.20 సగటుతో 141 వికెట్లు పడగొట్టారు.