సిపిఐ ఆధ్వర్యంలో 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 15 (జనం సాక్షి):
మణుగూరు లోని బొగ్గు ముఠా యూనియన్ కార్యాలయం ఎదుట పినపాక నియోజకవర్గ కార్యదర్శి స రెడ్డి పుల్లారెడ్డి ,ఏఐటియుసి కోల్ ట్రాన్స్పోర్ట్ గుమస్తా సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి 76 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా సిపిఐ పినపాక నియోజకవర్గ కార్యదర్శి పుల్లారెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల,పోరాట ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందని స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామని, స్వాతంత్రం ఉద్యమ స్ఫూర్తిని నేటి విద్యార్థులు యువతకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని, రాజ్యాంగ ఫలాలు ఇంకా అట్టడుగునున్నటువంటి ప్రజలకు అందడం లేదని, అందరికీ సమానంగా స్వాతంత్ర ఫలాలు అందినప్పుడే ,నిజమైన జాతికి అంకితం అవుతుందని ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలని అందరికీ సమానత్వం రావాలని వారు ఆకాంక్షించారు .ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య చౌదరి ,మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, ఏఐటియుసి మండల అధ్యక్ష కార్యదర్శులు తోట రమేష్ అక్కి నరసింహారావు ,మాజీ మండల కార్యదర్శి ఎస్ కే సర్వర్, ఎంపీటీసీ కామిశెట్టి రామారావు,బొగ్గు ముఠా అధ్యక్ష కార్యదర్శులు జ క్కుల రాజబాబు శ్రీకాకుళం వీరమల్లు, లింగస్వామి కనతాల కోటయ్య,గుమస్తా సంఘం అధ్యక్షులు భీమరాజు కృష్ణ, నాయకులు రఘువరన్ ,నరసింహారావు, అన్వర్,ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి సత్యనారాయణ, సత్యనారాయణ, నాయకులు లక్ష్మణ్, శంకర్ ,మల్లేష్, రషీద్ నరసింహారావు పాషా,కార్యవర్గ సభ్యులు ఎస్వీ నాయుడు, పరాల మల్లయ్య కేవీ నారాయణ సోందే కుటుంబరావు రాయల బిక్షం, రావుల రాములు అయితన బోయిన వెంకన్న,వార్డు మెంబర్లు కనితి సత్యనారాయణ, వజ్జా వెంకటేశ్వర్లు, రాములు పాల్గొన్నారు