సిసిఐ కొనుగోళ్లు పెరగాలి
రైతులకు అండగా నిలబడాలి
ఆదిలాబాద్,నవంబర్19(జనం సాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి హావిూ ఇచ్చినా కొనుగోళ్లు జరగడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శ కలవేన శంకర్ అన్నారు.జిల్లాలో రైతులు ఈ యేడు అత్యధికంగా పత్తి పంట సాగుచేశారు. గతేడాది కందులు వేసి నష్టపోయిన రైతులు మళ్లీ పత్తినే ఆశ్రయించడంతో దిగుబడి అధికం అయ్యిందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో రైతులు ఈసారి గతంలో కంటే ఎక్కువగా పత్తి పంటను సాగుచేశారు. రైతులు పత్తికి బదులు పప్పు దినుసుల పంటలను సాగు చేయగా కంది పంట కొనుగోళ్లలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఫలితంగా ఈ ఏడాది రైతులు పత్తి సాగువైపు మళ్లారు. ఫలితంగా ఈ సారి పంట దిగుబడులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండడంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని శంకర్ అన్నారు.
అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సీసీఐ ద్వారా ఎక్కువ కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు మంచి ధర లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులుండగా అదనంగా మరో ఆరు కేంద్రాల్లో సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోళ్లు జరుపనున్నారు. జిన్నింగ్ మిల్లు లు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుండడంతో ఎలాంటి సమస్య లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
కొనుగోలు చేసిన ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులు ఉంటే పత్తిని మిల్లుకు తరలించి బేళ్లను తయారుచేసినా తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పత్తి ధర పడిపోవడంతో రైతులకు కనీస ధర ఇప్పించేందుకు ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లను చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాలో పత్తి రైతులకు దళారుల బెడదను నివారించేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.