సి ఆర్ టి ల సమస్యలను పరిష్కరిస్తాం

నల్లబెల్లి అక్టోబర్ 11 (జనం సాక్షి):
సి ఆర్ టి ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా మండలంలోని మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ టైం స్కేల్, 12 నెలల వేతనాలు, పెండింగ్ సి ఆర్ టి ల సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు కృషి చేస్తుందన్నారు. గతంలో ఉపాధ్యాయులకు నూతన జీవోలను తీసుకొచ్చిన సంఘం పిఆర్టియు అని, త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతోపాటు ప్రమోషన్, బదిలీలు, పాఠశాలలోని స్కావెంజర్ల నియామకాల ఏర్పాటుకు పాటుపడతామన్నారు. అనంతరం శనిగరం, దస్తగిరి పల్లె ,కన్నారావుపేట, రుద్రగూడెం , గుండ్లపాడు,నారక్క పేట పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు నకిరెడ్డి మహేందర్, ప్రధాన కార్యదర్శి ఉడుత రాజేందర్, పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పోలోజు బిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి పొగాకు అచ్చయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పీరాల మల్లయ్య, మండల కార్యదర్శి బానోత్ కృష్ణ, సీనియర్ ఉపాధ్యాయులు శోభన్ బాబు, సతీష్ లు పాల్గొన్నారు.
Attachments area