సి పి ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి. సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ.

రామన్నపేట అక్టోబర్11 (జనంసాక్షి)
విజయవాడలో ఈనెల 14 నుంచి 18 వరకు నిర్వహించ తలపెట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రామన్నపేట సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో జాతీయ మహా సభల పోస్టర్ను ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ పేదల పక్షాన నిరంతరం సిపిఐ పార్టీ పోరాడుతుందని అన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన సిపిఐ నిత్యం ప్రజలు వెంటే ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరు జాతీయ మహాసభలకు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, మండల సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్, సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, ఉట్కూరి భగవంతం, వీరమల్ల ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, శివరాత్రి సమ్మయ్య, ఏనుతల రమేష్, పల్లే మల్లేష్, ఉట్కూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.