సీఎంకు ఝలక్ ఇచ్చిన వరంగల్ జిల్లా నేతలు
వరంగల్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి వరంగల్ జిల్లా నేతలు ఝలక్ ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, వైఎస్ ఛైర్మన్‌గా రాపోలు పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీ అధ్యక్షుడి పదవిని దొంతు మాధవరెడ్డికి ముఖ్యమంత్రి కట్టబెట్టాలనుకున్నా ఫలితం లేకపోయింది. కాగా వీరి ఎన్నికను మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.