సీఎం కె సి ఆర్ , మంత్రి కె టి ఆర్ సహకారంతో ఎల్బీనగర్ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు

 ఎల్బీనగర్( జనం సాక్షి )   ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో    ఎల్బీనగర్ నియోజకవర్గం పరిదిలోని మాజీ కార్పొరేటర్లతో కలిసి వెళ్లి   తెలంగాణ పశుసంవర్ధక , సినిమాటోగ్రఫీ మాత్యులు  తలసాని శ్రీనివాస్ యాదవ్ ని సికింద్రాబాద్ ఈస్ట్  మారేడుపల్లిలోని వారి నివాసంలో కలిసి ఎల్బీనగర్ నియోజకవర్గం సమస్యలపై , పార్టీ పటిష్టతపై చర్చించడం జరిగింది . ఈ సందర్బంగా మంత్రి  మాట్లాడుతూ గతంలో ఎల్బీనగర్ లో త్రాగునీరు, భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్లు, ప్లై ఓవర్ల నిర్మాణంకొరకు  ముఖ్యమంత్రి  కె సి ఆర్ ,  మున్సిపల్ శాఖా మంత్రి వర్యులు  కె టి ఆర్  సహకారంతో 1000 కోట్ల  రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగినదని,ఇప్పుడు కూడ అభివృద్ధి కొరకు  ముఖ్యమంత్రి  కె సి ఆర్ , మున్సిపల్ శాఖా మంత్రి వర్యులు  కె టి ఆర్  దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిదులు మంజూరు చేయిస్తామని, ఎల్బీనగర్ లో తెరాస పార్టీ పటిష్ఠతకు మీరందరు కలిసికట్టుగా పని చేయాలనీ, ఎల్బీనగర్ లో పార్టీ పరిస్థితిపై   ముఖ్యమంత్రి  కె సి ఆర్ , మున్సిపల్ శాఖా మంత్రి వర్యులు శ్రీ కె టి ఆర్  దృష్టికి తీసుకెళ్తానని, మీకు ఏ సమస్య వచ్చిన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్బంలో మాజీ కార్పొరేటర్లు  ,  ముద్రబోయిన శ్రీనివాస రావు ,  జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి ,, కొప్పుల విఠల్ రెడ్డి, జి వి సాగర్ రెడ్డి ,తెరాస పార్టీ సినియర్ కుంట్లూరు వెంకటేష్ గౌడ్, రామావత్ శ్రీనివాస్ నాయక్, చెరుకు ప్రశాంత్ గౌడ్, పవన్, రమణా రెడ్డి , వీరన్న  యాదవ్ , తిరుమల రెడ్డి తదితరులున్నారు.