సీఎం కేసీఆర్ పర్యటనకై యుద్ధ ప్రతిపాదికన ఏర్పాట్లు – కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
హనుమకొండ బ్యూరో చీఫ్ 27 సెప్టెంబర్ జనంసాక్షి
రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హనుమకొండ జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.
మంగళవారం నాడు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరంగల్ కలెక్టర్, గోపీ, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్యా, అదనపు జాయింట్ కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి దామెర లో గల ప్రతిమ హాస్పిటల్, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అక్టోబర్ 1 తేదీన ప్రతిమ హాస్పిటల్ ప్రారంభీస్తారని అన్నారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో భద్రత పకడ్బందీగా ఉండే విధంగా , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.