సీఎం రేవంత్‌తో అభిషేక్‌ మనుసింఫ్వీు భేటీ

న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి. ఇరువురు మధ్య దాదాపు పావుగంట సేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్విని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఒక సీటు ఉంది.గతంలో బీఆర్‌ఎస్‌లోవున్న కె కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌కి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజ్యసభ సీటుకు ఉపఎన్నిక అనివార్యమైంది. కేకే ప్లేస్‌లో అభిషేక్‌ మనుసింఫ్వీుకి పెద్దల సభకు పంపించాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించింది. ఆయనకు టికెట్‌ ఓకే చేసింది కూడా. సుదీర్ఘంగా కాంగ్రెస్‌ పార్టీకి సేవలందిస్తున్నారు అభిషేక్‌ మనుసింఫ్వీు. 2001 నుంచి పార్టీ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. రెండుసార్లు పెద్దల సభకు ఎన్నికయ్యారు. అయితే ఈ ఏడాది మొదట్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆయన అనుభవాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ పెద్దలు, మనుసింఫ్వీుని రాజ్యసభకు పంపాలని నిర్ణయించు కుంది. ఈనెల 21న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. 27న నామినేషన్‌ ఉప సంహరణ ప్రక్రియకు గడువు ఉంది. సెప్టెంబర్‌ మూడున పోలింగ్‌ జరగనుంది.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.