ఎన్నికుట్రలు చేసినా బెదిరేదిలేదు

` బీఆర్‌ఎస్‌ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నాలు
` హామీల పేరుతో గద్దెనెక్కి.. మాటమార్చిన సీఎం రేవంత్‌
` 35 సార్లు దిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు: కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. రూ. 15 వేలు రైతు భరోసా, రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మాయమాటలు చెప్పారని పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చి 450 రోజులు అవుతుందని.. రోజుకు ఒకరి చొప్పున 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా తగ్గించింది కేసీఆర్‌ ప్రభుత్వం అని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పిందని గుర్తు చేశారు. మరి కాలం తెచ్చిన కరువా..? కాంగ్రెస్‌ తెచ్చిన కరువా..? అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్‌ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్‌ చేయడం లేదని ఆరోపించారు. శివుడు గంగను కిందకు తీసుకువస్తే.. కేసీఆర్‌ గంగను పైకి తెచ్చిండని పేర్కొన్నారు. కానీ రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టారు అని కేటీఆర్‌ తెలిపారు. కాళేశ్వరంలో ఒక బ్యారేజ్‌లో ఒక పర్రె వడితే.. దానికి కాంగ్రెస్‌ నేతలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా లొల్లి పెట్టిండ్రు. మరి ఇవాళ సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోతే ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్‌, బీజేపోడు నోరెత్తడు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కూలిపోతే మాట్లాడరు. ఖమ్మం వద్ద పెద్దవాగు కొట్టుకుపోతే ఎవరు మాట్లాడరు. రేవంత్‌ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ ఉంది. కాళేశ్వరంలో ఒక పిల్లర్‌కు పర్రె వడితే.. ఎన్డీఎస్‌ఏ వాలిపోయింది. మరి ఇవాళ ఎస్‌ఎల్‌బీసీలో టన్నెల్‌ కూలి దాదాపు 72 గంటలు అవుతుంది మరి ఎందుకు ఎన్డీఎస్‌ఏ రాలేదు. ఏ బీజేపోడు మాట్లాడడు. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడం లేదు. ఏం ఇబ్బంది వచ్చింది. సుంకిశాల కూలిపోతే గవినోళ్ల శ్రీనివాస్‌ ఆర్టీఐ కింద రఖాస్తు పెట్టుకుంటే.. ఇది దేశ భధ్రతకు సంబంధించిన అంశం.. సమాధానం ఇవ్వమని చెప్పారు అని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఈ రెండే కాదు.. ఎన్నికల ప్రచారంలో మోదీ వచ్చి.. కాంగ్రెస్‌ పార్టీ అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతుంది.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ప్రధాని గర్జించిండు. కానీ ఇంత వరకు చర్య లేదు. రేవంత్‌ రెడ్డి బామ్మర్ది కంపెనీ శోధా 2 కోట్ల లాభం ఆర్జించింది. అమృత్‌ స్కీంలో రూ. 1137 కోట్ల కాంటాక్ట్‌ ఇచ్చిండు బామ్మర్ది కంపెనీకి రేవంత్‌ రెడ్డి. దీని మీద విచారణ చేయాలని సంబంధిత కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశాం. ఆరు నెలలు అవుతంది.. ఇప్పటి వరకు స్పందన లేదు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై ఈడీ రైడ్‌ అయింది.. ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పడం లేదు. ఇవన్నీ దేనికి సంకేతం.. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు. రేవంత్‌ రెడ్డి బీజేపీ మీద పల్తెత్తు మాట మాట్లాడం లేదు. కేసీఆర్‌ మీదనే మాట్లాడుతున్నడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్‌ పార్టీ ఉంటే.. కాంగ్రెస్‌, బీజేపీ ఆటలు సాగవని తెలుసు కాబట్టి.. ఆ ఇద్దరు కలిసి కేసీఆర్‌ పార్టీని ఖతం చేయాలన్నదే ఆలోచన. అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్కై సక్సెస్‌ అయ్యారని కేటీఆర్‌ తెలిపారు.
అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలో.. హస్తం నేతలు, కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌ సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గడచిన 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.ఎస్‌ఎల్‌బీసీ వద్ద ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారని, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, గాల్లో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 35 సార్లు దిల్లీ వెళ్లిన రేవంత్‌ రెడ్డి చేసిందేమిటి.. తాజాగా 36వ సారి వెళ్లి చేసేదేమిటని ప్రశ్నించారు. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని ఆక్షేపించారు. భారాసకు ఓటు ఎందుకు వేయలేదా అని ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారన్న కేటీఆర్‌… రేవంత్‌ రెడ్డిని చూసిన తర్వాతే కేసీఆర్‌ విలువ తెలుస్తోందని

 

ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదంపై జ్యుడీషియల్‌ కవిూషన్‌ వేయాలి
` ఎనిమిది ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం సరికాదు
` కాంగ్రెస్‌ ప్రభుత్వ 14 నెలల కాలంలో మూడు భారీ ప్రమాదాలు:కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో జ్యూడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణుల అనుమతి తీసుకోకుండానే టన్నెల్‌ పనులు ప్రారంభించారన్న వార్తల నేపథ్యంలో ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, అనుభవరాహిత్యమే కారణమని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ దుర్ఘటనలో చిక్కుకుని ఎనిమిది మంది కార్మికులు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం హెలికాప్టర్లలో ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారని విమర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించే తీరిక ముఖ్యమంత్రి లేదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో మూడు భారీ ప్రమాదాలు జరిగాయని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఖమ్మంలో పెద్దవాగు పూర్తిగా కొట్టుకుపోయిందని, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కోసం నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు కేటీఆర్‌. తాజాగా, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) పనుల్లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్‌ కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకున్నారని, 72 గంటలు గడిచినా ఇంకా వారిని బయటకు తీసుకురాలేకపోయారని వస్తున్న వార్తలపై కేటీఆర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా రాజకీయ లబ్ధి కోసం ‘‘లక్షల కోట్ల అవినీతి, వేల కోట్ల అవినీతి’’ అంటూ నానా యాగీ చేసిన కాంగ్రెస్‌ నాయకులు, కొంతమంది మేధావులు ఇప్పుడు ఏం చెప్తారని ప్రశ్నించారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణుల అనుమతి తీసుకోకుండా, ఆ సంస్థ ఇంజనీర్లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకముందే టన్నెల్‌ పనులు ప్రారంభించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్న కేటీఆర్‌, నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు జ్యూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ జ్యూడీషియల్‌ కవిూషన్‌ తో విచారణ జరిపి సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ ఎందుకు కూలింది? ఎస్‌.ఎల్‌.బీ.సీ టన్నెల్‌ ప్రమాదానికి కారణాలను రాష్ట్ర ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలను వేగవంతంగా చేపడుతూనే, ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, ఇతర సంస్థల సహకారంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించేందుకు ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు.