ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం

` వారి ప్రాణాలు కాపాడటమే మా తక్షణ కర్తవ్యం
` బురద నీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలు మారింది
` దేశంలోనే అత్యంత క్లిష్టమైన సొరంగం ఎస్‌ఎల్‌బీసీ
` బీఆర్‌ఎస్‌ హాయాంలో శ్రీశైలం, కాళేళ్వరం ప్రమాదాల్లో మేం రాజకీయం చేయలేదు
` డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి, కోమటిరెడ్డి
నాగర్‌కర్నూల్‌(జనంసాక్షి):శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలు చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కోమటి రెడ్డి వెంకట రెడ్డిలు స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క ఆద్వర్యంలోని మంత్రులబృందం నేడు ఎస్‌ఎల్‌?బీసీ ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయ కార్యక్రమాలను నేడు స్వయంగా అంచనా వేశారు. అనంతరం, వారు ప్రాజెక్ట్‌ స్థలంలోని జేపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయ కార్యక్రమాలపై సవిూక్షించారు.బురద ఉంది : ఈ సందర్బంగా ప్రమాద సంఘటన జరిగిన విధానాన్నిరాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌?తోసహా సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. ఎస్‌ఎల్‌?బీసీ సంఘటన స్థలంలో 40 నుంచి 50 విూటర్ల మేర బురద నిండుకుందని తెలిపారు. ఈ దుర్ఘటనలో 42 మంది సురక్షితంగా బయటికి రాగా, 8 మంది లోపల చిక్కుకున్నారని వివరించారు. బురద నీటిని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని వివరించారు. ఎడమ కాలువ టన్నెల్‌లో 11 కిలోవిూటర్ల తర్వాత నీటితో కలిగివుందని, అయినప్పటికీ 11.5 కిలోవిూటర్ల దూరం వరకు వివిధ ఏజెన్సీల రక్షణ బృందాలు వెళ్లగలిగాయని వివరించారు.13.50 కిలోవిూటర్ల వద్ద టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) ఉందని, అక్కడికి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇక్కడి నుంచి ఎయిర్‌ సప్లై పైప్‌ లైన్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనదని అన్నారు. సొరంగంలో ఎంత దూరం వరకు బురద, నీరు ఉందనేది జీఎస్‌ఐ, ఎంజీఆర్‌ఐలు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడిరచారు. చివరి 40 విూటర్లలో నీరు, బురద మట్టితో ఉందని ఏవిధమైన రాళ్లు, ఇతర ఘన పదార్థాలు ఉన్నట్టు కనిపించడం లేదని స్పష్టం చేశారు. 15 అడుగుల ఎత్తులో, 200 విూటర్ల వరకు ఈ బురద ఉందని అన్నారు. ప్రస్తుతం టన్నెల్‌లో 10 వేల ఘనపుటడుగుల (క్యూబిక్‌ విూటర్లు ) బురద ఉందని ప్రాధమికంగా అంచనా వేశామని, ఈ బురద నీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలుగా ఉందని పేర్కొన్నారు. కన్వేయర్‌ బెల్ట్‌?కు మరమత్తులు జరుగుతున్నాయని, ఈ కన్వేయర్‌ బెల్ట్‌కు రేపు సాయంత్రం లేదా ఎల్లుండిలోగా మరమత్తులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా గంటకు 800 టన్నుల ఘణపుతడుల బురదను బయటికి తీయ వచ్చని అన్నారు. వీటిని మరింత త్వరిత గతిన వెలికి తీయడానికి అక్కడికి వెళ్లగలిగే జేసీపీలను తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టన్నెల్‌?లో గంటకు 3600 నుండి 5000 లీటర్ల ఊట నీరు వస్తుందని తెలిపారు. లోపలి నుంచి నీటితో పాటు, బురదను కూడా బయటికి తీయడానికి ఒకే పైప్‌ లైన్‌ వినియోగించనున్నామని స్పష్టం చేశారు.దేశంలోనే ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేయాల్సిన పనులు అన్నీ చేస్తున్నామని తెలిపారు. వారి ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని, ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, ఆర్మీ, జీఎస్‌ఐ ఇలా 10 సంస్థలకు చెందిన నిపుణులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపు ఎన్‌జీఆర్‌ఐ, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ నిపుణులు రానున్నారని వెల్లడిరచారు. గంటకోసారి పరిస్థితిని సీఎం రేవంత్‌ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు.ఎస్‌ఎల్‌బీసీ సహాయ చర్యలపై విమర్శలను తప్పుబట్టిన మంత్రి ఉత్తమ్‌ చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలిపారు. సీనియర్‌ మంత్రులం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. విమర్శించే వారు తమ హయాంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని హితువు పలికారు. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో పేలుడు జరిగి 8 మంది చనిపోయారని, కాళేశ్వరం సొరంగ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోని ప్రమాదాలపై తాము రాజకీయం చేయలేదని అన్నారు.

వంద విూటర్ల దూరంలో ఆగిపోయాం
` గనిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తునాం
` ఉత్తరాఖండ్‌ బృందం
జనంసాక్షి:ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న వారి జాడ కోసం శ్రమిస్తున్న ఉత్తరాఖండ్‌ బృందం ` గతంలో ఉత్తరాఖండ్‌ సొరంగం ప్రమాదంలో 42 మందిని కాపాడిన బృందం ` శాయశక్తులా శ్రమించి చివరి 100 విూటర్లకు చేరుకుంటామంటున్న బృందం ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న రక్షణ చర్యలకు సహాయం చేసేందుకు ఉత్తరాఖండ్‌ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ బృందం గతంలో ఉత్తరాఖండ్‌లో సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో సుమారు 42 మందిని రక్షించారు. నిన్న వెళ్లినప్పుడు చివరి 100 విూటర్ల వరకు చేరుకున్నా అక్కడి పరిస్థితిని చెపుతామంటున్నారు. సొరంగంలోకి వెళ్తున్న ఉత్తరాఖండ్‌ బృందంతో మా ప్రతినిధి స్వామికిరణ్‌ ముఖాముఖి ముచ్చటించారు.నిన్న వెళ్లినప్పుడు వంద విూటర్ల దూరంలో నిలిచిపోవాల్సి వచ్చిందని, ఇవాళ పూర్తి సామాగ్రితో వెళ్తున్నామని సిబ్బంది తెలిపారు. వారిని రక్షించేందుకు తమ పూర్తిస్థాయి సామర్థ్యంతో శ్రమిస్తున్నామని చెప్పారు. టెన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ సొరంగంలో అడ్డుగా ఉన్నందున మరింత ముందుకు వెళ్లడం కష్టంగా ఉందన్నారు. ఇవాళ మరోసారి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. లోపల అంతా బురదగా ఉండటం వల్ల కిలోవిూటర్‌ మేర నడవటం చాలా కష్టంగా ఉంది. ఇవాళ తాళ్లు, లైట్ల సాయంతో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ టీబీఎం ముందుకు చేరుకుంటే లోపల చిక్కుకున్న వారి గురించి తెలిసే అవకాశం ఉందంటున్నారు.