సీఎం సభకు భారీగా తరలి వెళ్లిన గిరిజనులు
శివ్వంపేట సెప్టెంబర్ 17 జనంసాక్షి : హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గిరిజనుల ఆత్మగౌరవ భవనమైన బంజారా భవన్ ప్రారంభోత్సవం అలాగే గిరిజనుల బహిరంగ సభ కు మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రమైన శివ్వంపేట లోని అన్ని గిరిజన తండాల నుంచి గిరిజన ప్రజలు భారీ సంఖ్యలో సీఎం సభకు తరలి వెళ్లారు. శివ్వంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, జిల్లా ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు, స్థానిక ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రగౌడ్, పిఎస్సీ ఎస్ చైర్మన్ చింతల వెంకట్ రాం రెడ్డి, మండల పార్టీ కోశాధికారి గంగాధర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు రవి నాయక్ జెండా ఊపి బస్సుల ర్యాలీని సీఎం సభకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాసం నవీన్ కుమార్, సర్పంచులు సోనీ రవినాయక్, బాబురావు, పార్వతి సత్యం, మెగావత్ రవి, మోతి, చెన్నా నాయక్, రాజు నాయక్, నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ సూర్యం చౌహాన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, మండల పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
Attachments area