సీఎం సహాయనిధి చెక్కుల అందజేత
జగదేవ్ పూర్ , అక్టోబర్ 11 (జనంసాక్షి):
జగదేవ్ పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ఇరువురు లబ్ధిదారులకు మంజూరైన సిఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం టిఆర్ ఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మాస్కురి ఎల్లం, బరిగే లింగం కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. చికిత్స కోసం ఇరువురికి అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ వంటేరు యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డిల సహకారంతో ముఖ్యమంత్రి సహాయానిధి కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మాస్కురి ఎల్లంకు రూ.22000 లు, బరిగే లింగంకు రూ.24,000ల చొప్పున ఆర్థిక సహాయం కింద మంజూరైన చెక్కులను ఉపసర్పంచ్ జూపల్లి భాస్కర్, టిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జూపల్లి మధులు లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయానిధికి సహకరిoచిన ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా యం యల్ సి యాదవ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ నాగరాజు, గ్రామ టిఆర్ ఎస్ మాజీ అధ్యక్షుడు కుకునూర్ నారాయణ, వార్డు సభ్యులు దేవేందర్, మ్యాడమైన సిద్దులు, కర్ణాకర్, నర్సయ్య, చిన్న సత్యనారాయణ, గోపాల్ తదితరులు ఉన్నారు.
Attachments area