సీజనల్ వ్యాధులపై చెంచు పెంటల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ*

నాగర్ కర్నూల్ రూరల్:జులై 17(జనంసాక్షి)
వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహకారంతో మెడిమల్కల,సంగిడిగుండాల,అప్పపుర్,బౌరపుర్,పుళ్ళయపల్లి,మల్లాపూర్ చెంచు పెంటల్లో ఇంటి ఇంటికి తిరిగి చెంచుల ఆరోగ్యంపై ఫీవర్ సర్వే నిర్వహించి,ప్రత్యెక వైద్య శిబిరాన్ని  నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని ముందుఉండి నడిపించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్ మాట్లాడుతూ,చెంచు పెంటల్లోని చెంచుల ఆరోగ్యం కోసం ప్రత్యేక డ్రైవ్ ద్వారా 30మంది వైద్య సిబ్బందికి ఉదయం ఏడు గంటలకే మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రత్యేక అవగహన కల్పించి,చెంచు పెంటలలోని గుడిసె గుడిసెకి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహణ చేయడం జరిగిందని,జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య బృందాలచే రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందచేయడం జరిగిందని,చెంచులకు వక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత,మరియు సిజినల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెడిమల్కల,సంగిడిగూండాల,మల్లాపూపుర్,పుల్లయపల్లి పెంటల్లో హెల్త్ హైజినిక్ కిట్లు ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో డా.సురేష్బా బు,డా.శివ,డా.గౌతం,డా.సాయినాథ్,రెడ్ క్రాస్ సెక్రెటరీ రమేష్ రెడ్డి,జిల్లా ఉప మలేరియా అధికారి ఆర్.శ్రీనివాసులు,హెల్త్ ఎడ్యుకేటర్ ఓ.శ్రీనివాసులు,అశోక్ ప్రసాద్ వైద్య సిబ్బంది లోక్యానాయక్,మన్ననూర్,పదర,వట్వర్లపల్లి, ఉప్పునుంతల,బల్మూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.