సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు  అనారోగ్యాల పాలవుతాము. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే త్వరగా నయం చేసుకోవచ్చు. వాతావరణంలోని మార్పుల వల్ల జలుబు దగ్గు వంటి సీజనల్ సమస్యలు తలెత్తడం సహజo.ఆస్తమా వంటి శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల క్రిమి కీటకాలు చేరుతాయి. తడి ప్రదేశాల్లో , వస్తువులపై  దోమలు చేరి వ్యాధులకు గురిచేస్తాయి. మీరు మీ ఆరోగ్యంతో పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షంలో తడిసిన తర్వాత బట్టలు బయట విడిచి స్నానం చేసి ఇంటికి రావటం ఉత్తమం. వర్సకాలంలో ఇంట్లోకి  చాలా మట్టి, నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఈగలు దోమల, కీటకాలు చేరి వ్యాధుల బారిన పడతారు. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువే: ఇవి ఇంట్లోకి రాకుండా సాయంత్రం కాగానే కిటికీలు తలుపులు మూసేసి ఇంటిని పరిశుభ్రంగా ఉంచినా సరే ఎలాగలో అవి ఇంట్లోకి వచ్చేస్తాయి దానివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. నిజానికి ఇంటిని పరిశుభ్రంగా వచ్చినప్పటికీ ఈ సమస్య ఎదురవుతుంది. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే దోమలు రావడానికి కారణం అవుతున్నాయి ఇంట్లో చెత్త డబ్బాలో వేసిన చెత్త ఏ రోజు కారోజు బయట.వేయటం ఇంటి బయట లేదంటే ఇంట్లో నీళ్లు ఎక్కువ రోజులపాటు నిల్వ ఉండటం వల్ల దోమలు రావడానికి ప్రధాన కారణాలు అందుకే ఈ సమస్య లేకుండా ఇంటి చుట్టూ క్రిమిసంవారకాలను స్ప్రే చేయటం నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్త పడటం ఒకవేళ డ్రైనేజీ నీళ్లు నిలిచిపోయి ఉంటే అందులో కాస్త కిరోసిన్ పోయడం తులసి బంతి లావెండర్ వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవడం ఇంట్లో అక్కడక్కడ కొన్ని అత్యవసర నూనెలు కర్పూరం వంటివి ఉంచడం వల్ల దోమల బెడద తగ్గించుకోవచ్చు.
డాక్టర్ గిరిప్రసాద్ (ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ):  వర్షాకాలంలో ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరం దోమల వల్ల మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా లాంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి.  వీటి బారిన పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.
ఆహార విషయంలో జాగ్రత్తలు:   ప్రతిరోజు మరిగించి చల్లార్చిన నీళ్లు తాగటం తాజా ఆకుకూరలు కాయగూరలు పండ్లు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ వర్షాకాలంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు పకోడీలు స్వీట్ కార్న్లు వాటి పైకి మనసు లాగడం సహజం ఇవి ఎక్కువగా తినడం వల్ల అజీర్తి జీర్ణ సంబంధిత సమస్యలు తెలుపుతాయి కాబట్టి ఇలాంటివి ఇంట్లోనే పరిశుభ్రంగా తయారు చేసుకుని తినటం మంచిది.
తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి:  కాయగూరలు పండ్లు ముందే కట్ చేసుకుని ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదు దానివల్ల గాలిలోని బ్యాక్టీరియా వైరస్ లు వాటిపై చేరుతాయి. వండుకునే ఆహార విషయంలో ఎప్పటికప్పుడు వేడివేడి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. మంచినీరు తగినంత తీసుకోవాలి దాహం వేయట్లేదని నీళ్లు తాగకపోతే డి హైడ్రేషన్ బారిన పడతారు. ఈ సీజన్లో నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే ఈ కాలంలో జీర్ణకియా మందకోడిగా సాగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి నిద్రలేమి ప్రభావం వల్ల  రోగనిరోధక వ్యవస్థపై పడుతుంది. ఈ కాలంలో శీతల పానీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి చిన్నపిల్లలకు ప్రత్యేక డాక్టర్ అందుబాటులో ఉన్నారు.