సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎంపీవో అప్సర్ పాషా
దంతాలపల్లి జూలై 29 జనం సాక్షి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీవో అప్సర్ పాషా పేర్కొన్నారు.శుక్రవారం మండలానికి చెందిన ఆగ పేట గ్రామంలో దంతాలపళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీవో అప్సర్ పాష మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్న కారణంగా గ్రామాలలో నీరు నిల్వ ఉండడం వలన దోమలు,ఈగలు అధికంగా వృద్ధి చెంది మలేరియా,డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ప్రమాదం ఉంది కాబట్టి వివిధ గ్రామాల ప్రజలు ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడడమే కాకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ వారు నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని తెలియజేశారు. అనంతరం డాక్టర్ సూర్య గ్రామానికి చెందిన 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇమ్మడి సంధ్య,ఉప సర్పంచ్ సత్తిబాబు,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బాలాజీ, హెల్త్ అసిస్టెంట్ చలపతిరావు, ఏఎన్ఎంలు ఆరోగ్య, శారద,ఆశా వర్కర్లు మల్లికాంబ,యాక లక్ష్మి, ఉమాతదితరులు పాల్గొన్నారు.