సుజన రాజీనామా డ్రామా?
హైదరాబాద్, డిసెంబర్ 9 (జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేతను చంద్రబాబునాయుడుకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌డీఐలపై
రాజ్యసభలో నిర్వహించిన ఓటింగ్‌కు గైర్హాజరైన టీడీపీ ఎంపీల తీరుపై ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తాయి. పారిశ్రామిక వేత్త అయిన సుజనా చౌదరి కేంద్రంతో కుమ్మ్కయ్యాడని ఆ పార్టీ నేతలే బహాటంగా ఆరోపణలు గుప్పించారు. చీమూనెత్తురు ఉంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత కూడా వారిపై అసహనం వ్యక్తం చేసినా ఎంపీలు చేసింది పెద్ద తప్పేమి కాదని చెప్పారు. వారు తప్పు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత సుజనా చౌదరి రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు. రాజీనామా చేసే ఉద్దేశమే ఉంటే నేరుగా రాజ్యసభ చైర్మన్‌కే పంపి ఉండొచ్చు కానీ సుజన అలా వ్యవహరించలేదు. ఆరోపణల నుంచి బయట పడేందుకే ఇలా చేశాడని తెలుస్తోంది.