సుప్రీం చెప్పింది కరక్టే మేం పంజరంలో చిలకలమే!

ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలతో ఏకీభవించిన సీబీఐ డైరెక్టర్ట్‌
న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) :
కేంద్ర దర్యాప్తు సంస్థపై సర్వోన్నత న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యలను సీబీఐ అంగీకరిం చింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో వాస్త వం ఉందని వెల్లడించింది. బొగ్గు కుంబ óకోణం వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం సీబీఐపై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికే తలమానికమైన కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిం దని ఆవేదన వ్యక్తం చేసింది. సీబీఐ పంజరంలో చిలకలా మా రిందని, తన బాసులు చెప్పినట్లు నడుచు కోవాల్సి వస్తోందని న్యాయస్థానం పేర్కొం ది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా అంగీకరించారు. పంజరంలో చిలుకలా సీబీఐ మారిందన్న న్యాయస్థానం వ్యాఖ్యలపై గురువారం ఆ యనను పలువురు విలేకరులు ప్రశ్నించ గా.. నిజమేనని వ్యాఖ్యానించా రు. ‘సుప్రీం కోర్టు ఏం చెప్పిందో అది నిజమే’నని వెల్ల డించారు. మిగతా అంశాలపై ప్రశ్నించగా.. ఆయన సమాధా నాలు చెప్పేందుకు నిరాకరిం చారు. విలేకరులతో మాట్లాడేం దుకు నిరాసక్తత చూపించారు.ఇదిలా ఉం టే, సుప్రీంకోర్టు ప్రభుత్వానికి గట్టిగా తలంటినా కాంగ్రెస్‌ లైట్‌గా తీసుకుంది. న్యాయస్థానం కేవలం వ్యాఖ్యలు చేసిందే తప్పా ఉత్తర్వులు జారీ చేయలేదని ఆ పార్టీ నేత దిగ్విజ య్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాటా ్లడుతూ.. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయ లేదని తెలిపారు. ‘సుప్రీంకోర్టు వ్యాఖ్యలే చేసింది తప్ప ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఒకవేళ కోర్టులిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేసి ఉంటే.. అప్పుడు వాటిపై మేం ప్రతిస్పందిస్తాం. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. దర్యాప్తు ఎక్కడా ప్రభావితం కాలేదు. ఎక్కడా జోక్యం చేసుకోలేదు’ అని తెలిపారు.