సురేందర్ మృతదేహాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి*
*దేవరుప్పుల, సెప్టెంబర్ 30 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం దుబ్బ తండా గ్రామంలో గురువారం సాయంత్రం లకావత్ సురేందర్ (35) అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద మేకలు మేపుతుండగా అకస్మాత్తుగా పిడుగు పడి మృతి చెందగా శుక్రవారం జనగామ ఏరియా ఆస్పత్రిలో సురేందర్ మృతదేహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.సురేందర్ లేని లోటు కుటుంబానికి పార్టీకి తీరనిలోటు వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ సీనియర్ నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి బస్వ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.