సెప్టెంబర్‌ 30న దూం తడాకే వలసాంధ్ర్ర పాలనకు చరమగీతం

-జిల్లాలో మెడికల్‌ కాలేజిని ఏర్పాటుచేయాలి
-ఈజిప్ట్‌ తరహాలో ఉద్యమం
-తెలంగాణ ప్రజలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారు.
-నాటి నుండి నేటివరకు తెలంగాణకు అన్యాయమే
-వనరుల దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి
-ప్రత్యేక రాష్ట్రం ద్వారానే తెలంగాణకు న్యాయం
-గ్రామస్థాయినుండి జేఏసిల బలోపేతం
-స్థానిక సమస్యలపైనే పోరాటం
–తెలంగాణ ఐకాస చైర్మన్‌ ప్ర్రొఫెసర్‌ కోదండరాం
కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): వలసాంథ్ర పాలనకు చరమగీతం పాడి తెలంగాణ సాధించుకోవాలని సెప్టెంబర్‌ 30న మరోసారి సీమాంథ్రనేతలకు దడపుట్టేలా దూం తడాఖాను చూపుతామని తెలంగాణ ఐకాస చైర్మెన్‌ ఫ్రోఫెసర్‌ కోదండారాం పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌లో డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆద్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, వర్త్తమానం-భవిష్యత్తు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సు,లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధనకోసం ఉద్యమాన్ని చేపట్టాలని అన్నారు. తెలంగాణ మార్చ్‌ పేరుతో భారీ ఉద్యమ నిర్మాణానికి రూపకల్పనను చేస్తున్నట్లు తెలిపారు. నాటినుండి నేటివరకు వలసాంధ్రుల పాలనలో మోసానికి గురిఅవుతూనే ఉందని అన్నారు. ఇక్కడి ప్రజలకు ఓటు బ్యాంక్‌ తప్ప అభివృద్ధిలో వాటా ఇవ్వడం లేదని దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం మొదలైందన్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి వలస పాలకులను నిలదీస్తున్నారని ఈ సందర్బంగా అన్నారు. తెలంగాణ సమస్యను జాతీయ సమస్యగా చూపుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌్‌ కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని అన్నారు. రాయపాటి, లగడిపాటి, కావూరిలకు పరోక్షంగా మద్దతిస్తూ తెలంగాణ రాకకు అడ్డుపడుతున్నారని ఈ కుట్రలకు త్వరలోనే ముగింపు పలుకుతామని అన్నారు. ఈ ఉద్యమంలో ఉపాద్యాయుల పాత్ర కీలకమైందని, 1996 నుండి 2009 వరకు జరిగిన ఉద్యమాల్లో ఉపాద్యాయులు తమవంతు కృషి చేశారని గ్రామస్థాయినుండి తెలంగాణపై అవగాహనను కల్పించడంలో ఉపాద్యాయులు ముందున్నారని అన్నారు. వలసాంథ్ర పాలకులు కోస్తాంధ్ర ధనిక వర్గం రాష్రాన్ని సమైఖ్యంగా వుంచడం ద్వారానే తమ వ్యాపారం కొనసాగుతుందని తెలంగాణ ఉద్యమాన్ని అనిణిచివేస్తున్నారు. ప్రతీ రంగంలోను తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఈ ప్రాంతానికి చెందిన పాలకులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగా నిర్మాత అంబేద్కర్‌ చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పినప్పటికి దీనిపై స్సందన లేకపోగా ఇందుకు వ్యతిరేకంగా సీమాంధ్రులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ ఆద్వర్యంలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి నుండి ప్రభుత్వానికి యేటా వందల కోట్ల రూపాయలు రాయల్టీని చెల్లిస్తుందన్నారు. సింగరేణి అనుబందంగా మెడికల్‌ కళాశాలను నిర్మిస్తే ఇక్కడి కార్మికులకు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తోపాటు స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్నా ఎరువులు, విత్తనాలపై స్పందిచాలని అన్నారు. రాజకీయ అనైఖ్యత వల్లనే తెలంగాణ రాష్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుందని విమర్శించారు. కోస్థాంధ్రలోని రెడ్డి, కమ్మ ఆదిపత్యంలోనే ప్రభుత్వం నడుస్తుందన్నారు. సినిమా, పత్రిక, వ్యాపార రంగాలు ఆంధ్రవలస వాదుల చేతులోనే ఉండడం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదన్నారు. టిడిపి అధికారంలో వచ్చి ఎన్‌టిఆర్‌ పాలనలో తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. చెరువులను గ్రామ వ్యవస్థను నాశనం చేసింది టిడిపిేయే అని అన్నారు. ఎన్‌టిఆర్‌ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రాజెక్టులను నిర్మించకుండా బోర్లద్వారానే వ్యవసాయం చేయాలని సూచించారన్నారు. నాటినుండి నేటి వరకు ఈ ప్రాంతానికి జరుగుతున్న్న అన్యాయాలకు తెలంగాణ సిధ్దాంతకర్త ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్నా అన్యాయాలపై తెలంగాణ ప్రజలకు 50యోళ్ళుగా అవగాహనను కల్పిస్తునే ఉన్నారు. సాగర్‌ జలాలను ఆంధ్ర ప్రాంత పంటలకు నీటిని విడుదల చేయుడం అన్యాయం అనిఅన్నారు. డెడ్‌ స్టోరేజిలోఉన్న నీరు తాగడానికి మాత్రమే వినియోగించాల్సి ఉండగా సీమాంధ్ర వలస పాలకులు పార్టీలకు అతీతంగా నీటిని తరలించుకపోవడాన్ని తెలంగాణ మంత్రులు చూస్తూ ప్ర్రెేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. మెడికల్‌ సీట్ల కేటాయింపు విషయంలో నోరువిప్పక పోవడంపై జేఏసి తెలంగాణ వాదులు నిరసన వ్యక్తం చేయడంతో హైకోర్టు తెలంగాణకు అనుకూలంగా తీర్పు చెప్పిిందన్నారు. ఈ సదస్సుకు జిల్లా జేఏసి చైర్మ్‌న్‌ వెంకట మల్లయ్య, ఉద్యోగ జేఏసి చైర్మ్‌న్‌ అమీద్‌, డిఈఓ కందిమళ్ళ లింగయ్య, డిటిఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి, గంగాదర్‌, రవిశంకర్‌ రెడ్డి, డీటీఎఫ్‌ నాయకులు ఎమ్‌ఎన్‌ కిష్టప్ప, గంగాధర్‌, కవ్వం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గోన్నారు.